1 మరియు 2 తిమోతి మరియు తీతుకు

పౌలు తన జీవిత ముగింపుకు వచ్చుచుండగా, విశ్వాసములో తన “కుమారులైన” తిమోతి మరియు తీతుకు ఆయన వ్రాశాడు. ఎఫేసు మరియు క్రేతులో తమ పరిచర్యలలో యౌవనస్తులైన సువర్తికులను ప్రోత్సహించాలని అపొస్తలుడు ఆశించాడు. ప్రభువు సంఘములో వారు ప్రభావవంతమైన మరియు ఫలభరితమైన సేవ చేయుచు సత్యమును ప్రకటించుచు అసత్యమును తిరస్కరించాలని ఆయన కోరాడు. క్రైస్తవ జీవితమును ఎలా జీవించాలని అను ఈ హెచ్చరికలు దైవిక ప్రేరణ కలిగినవని నొక్కి చెప్పాడు. దేవుడు ఆయనపై చూపించిన దయను నొక్కి చెప్పుచూ ఆ సహోదరులు సత్యమును కాపాడుచు, భద్రపరుస్తూ, ఆచరించాలని వ్యక్తపరచాడు.

ఈ మూడు పత్రికలపై చాలా యేండ్లు అధ్యయనం చేసి బోధించిన తరువాత డేవిడ్ రోపర్ (David Proper) అద్భుతమైన వచనము వెంబడి వచన అధ్యయనమును అందించాడు. రోపర్ యొక్క వ్రాత విధానముతో కథనములు మరియు పద అధ్యయనాలు మంచిగా వచ్చాయి.


కోర్సులో ఏమి లభిస్తాయి?

ఈ 50 రోజుల కోర్సు మీకు అవసరమైన అన్ని అంశాలతో అందించబడుతుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి మీకు అదనపు సమయం అవసరమైతే, మీరు అదనపు 30 రోజులపాటు సమయాన్ని పెంచుకోవచ్చు. నమూనా కోర్సు అంశాలు చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డిజిటల్ పుస్తకం

1 మరియు 2 తిమోతి మరియు తీతుకు పుస్తకం డేవిడ్ రోపర్ (David Roper) వ్రాశారు, దాని డిజిటల్ కాపీ మీకు కోర్సులో మీ అధ్యాపకుని వలె ఉపయోగపడుతుంది మరియు కోర్సు ముగిసిన తర్వాత అది మీ స్వంతమవుతుంది.

ఐదు అధ్యయన మార్గదర్శకాలు

ఇవి మీరు చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన కీలక పదాలు, అంశాలు, వ్యక్తులు మరియు స్థలాలను మీకు తెలియజేయడం ద్వారా మీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయంగా ఉంటాయి.

ఆరు పరీక్షలు

మీకు ఆటంకం కాకుండా సహాయంగా రూపొందించబడిన ప్రతి పరీక్షలో నేర్పిన అంశాలను మీరు చక్కగా అర్థం చేసుకున్నారని నిర్ధారించడానికి చదవాలని పేర్కొన్న వాటి నుండి సేకరించిన యాభై ప్రశ్నలు ఉంటాయి. చివరి పరీక్షలో అన్ని అంశాల నుండి ప్రశ్నలు ఉంటాయి.

చదవాల్సిన వేగం మార్గదర్శకం

మీరు చదువుతున్న వేగం మార్గదర్శకంతో మీరు చదవాల్సిన షెడ్యూల్ కంటే ముందు ఉండండి. ఈ మార్గదర్శకం మీరు సెట్ చేసుకున్న సమయంలో కోర్సు పూర్తి చేయడానికి ఒక రోజులో చదవాల్సిన పేజీల సంఖ్యను తెలియజేస్తుంది.