తరచూ అడిగే ప్రశ్నలు

మీకు మా పాఠశాల లేదా కోర్సుల గురించి ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? మీ పలు ప్రశ్నలకు సమాధానాలను మా FAQ విభాగంలో పొందవచ్చు.

ఆన్‌లైన్ స్కూల్ గురించి ప్రశ్నలు

కోర్సులో నమోదు చేయడం గురించి ప్రశ్నలు

చెల్లింపు సంబంధిత ప్రశ్నలు

కోర్సులో చేరడం గురించి ప్రశ్నలు

పరీక్షలు గురించి ప్రశ్నలు

సాంకేతిక ప్రశ్నలు

మద్దతు ప్రశ్నలు


ఆన్‌లైన్ స్కూల్ గురించి ప్రశ్నలు

ప్ర. ఈ స్కూల్ యొక్క ఉపయోగం ఏమిటి?

జీసస్ తన ప్రజలకు ఈ మిషన్ అప్పగించారు: “కనుక మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్తయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు! నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మాథ్యూ 28:19, 20). Through the Scriptures ప్రతి దేశంలోనూ నేర్చుకోవాలనే తపన గల వారికి మొత్తం బైబిల్‌ను బోధించే విధిని లక్ష్యంగా చేసుకుంది.

ప్ర. తరగతులు ఎక్కడ బోధిస్తారా?

కోర్సులు చదవగల సామర్థ్యం ఆధారంగా మరియు పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించబడతాయి. మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నట్లయితే, ఈ కోర్సులు మీరు ఎక్కడ ఉన్నారు అనే దానితో సంబంధం లేకుండా మీ కోసం ఉద్దేశించినవే.

ప్ర. ఇది బోధకులకు శిక్షణ ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడిందా?

మేము పటిష్టమైన మరియు సంపూర్ణ బైబిలికల్ జ్ఞానాన్ని అందిస్తున్నప్పటికీ, Through the Scriptures అనేది “బోధకుల స్కూల్” మాత్రమే కాదు. ఈ స్కూల్ భగవంతుని వాక్యాలు గురించి మరింత తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరి కోసం రూపొందించబడింది.

ప్ర. కోర్సులో చేరడానికి నేను ఒక క్రైస్తవుడిని లేదా నిర్దిష్ట నామవర్గానికి చెందిన వాడిని అయ్యి ఉండాలి?

లేదు. మీరు నేర్చుకోవడానికి “సిద్ధంగా” ఉంటే సరిపోతుంది. “వినుటకు చెవులుగలవాడు వినుగాక.” (మాథ్యూ 11:15).

ప్ర. ఈ కోర్సుల్లో ఏ నామవర్గీకరణ మతవిశ్వాసాన్ని బోధిస్తారు?

ఈ కోర్సుల్లో ఎలాంటి నామవర్గీకరణ లేదా ఒంటెత్తు మతవిశ్వాసం లేదా విశ్వాసానికి సంబంధించిన అంశాలను బోధించము. ప్రవక్త పాల్ ఇలా చెప్పారు, “సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు మన ప్రభ్రువైన యేసు క్రీసు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.” (1 కొరింథెయిన్స్ 1:10). క్రీస్తు చర్చి ఈ విభజనలు నుండి విముక్తి పొందాలంటే, మనం అందరూ ఒకే వాక్యం ఆధారంగా ఏకీకృతం కావాలి: భగవంతుడే మనకు బోధించిన సందేశం ఆధారంగా. మా కోర్సుల యొక్క రచయితలు ఈ విభజనకు కారణమయ్యే మానవుని యొక్క ఆచరాలు మరియు అవసరాలను విస్మరించాలని నిర్ణయించుకున్నారు; వారు మనకి తన బైబిల్‌లో భగవంతుడు పేర్కొన్న స్వచ్ఛమైన సందేశాన్ని మాత్రమే బోధించాలని నిర్ణయించుకున్నారు. “మంచి మనస్సు” గల బెరీన్స్ చేసిన “ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి”  విధంగా మేము చేస్తామని మీతో  వాగ్దానం చేస్తున్నాము (Acts 17:11).

ప్ర. Through the Scriptures అనేది అధీకృత స్కూలా?

Through the Scriptures అనేది అధీకృత స్కూల్ కాదు. అయితే, బైబిల్ యొక్క సమగ్ర జ్ఞానం అవసరమైన ఎక్కడైనా మొత్తం బైబిల్ అధ్యయనాన్ని పూర్తి చేసినట్లు అందే సర్టిఫికేట్ చాలా విలువ ఉంటుంది.

ప్ర. Through the Scriptures కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్‌లను ఇస్తుందా?

కోర్సు సమూహంలోని ప్రతి కోర్సును పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్‌లు ఇవ్వబడతాయి. కోర్సు సమూహం యొక్క ఉదాహరణ న్యూ టెస్టామెంట్ చరిత్ర, దీనిలో ఇవి ఉంటాయి: క్రీస్తు జీవితం, 1; క్రీస్తు జీవితం, 2; మత్తయు 1—13; మత్తయు 14—28; మార్కు; లూకా 1:1—9:50; లూకా 9:51—24:53; జాన్ 1—10;  జాన్ 11—21; అపొస్తలుల కార్యములు 1—14; అపొస్తలుల కార్యములు 15—28. సమూహ కోర్సులపై మరింత సమాచారం కోసం, సెమిస్టర్ స్టడీస్ పేజీ చూడండి.

ప్ర. Through the Scriptures మినిస్టరీకి లైసెన్స్‌లను అందిస్తుందా?

బోధించడానికి ఒకరికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు మరియు Through the Scriptures ఎవరినీ మినిస్టరీకి సిఫార్సు చేయదు. ఒక వ్యక్తి భగవంతునికి సేవ చేయడానికి బైబిల్ అతనికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది మరియు ఆ జ్ఞానాన్నే మేము బోధిస్తాము. “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 టిమోథే 3:16, 17).

ప్ర. దీనిలో ఇతర కోర్సులు అందుబాటులో ఉన్నాయి?

కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చిన వెంటనే వాటిని జోడిస్తాము. మా కనీస లక్ష్యం ఏమిటంటే మేము ప్రస్తుతం అందించే కోర్సుల్లో మొత్తం బైబిల్‌ను వివరిస్తున్న విధంగానే వివరించే కోర్సులను సిద్ధం చేయాలనేది.

ప్ర. ఈ స్కూల్‌లో ఇతర భాషల్లో బోధిస్తారా?

Through the Scriptures అనేది ఇరవై మూడు భాషల్లో అందుబాటులో ఉంది! ఇంగ్లీష్ కాకుండా, మేము కోర్సులను అరబిక్, బెంగాలీ, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, హిందీ, ఇండోనేషియన్, జపనీస్, కన్నడ, కొరియన్, యలయాళం, నేపాలీ, పోర్చుగీసు, పంజాబీ, రష్యన్, స్పానిష్, తమిళం, తెలుగు, ఉర్దూ మరియు వియత్నామీస్. ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉండే అన్ని కోర్సులు తక్షణమే ఇతర భాషల్లో అందుబాటులో ఉండవు ఎందుకంటే ప్రతి కోర్సును అనువదించడానికి సమయం పడుతుంది. క్రమంగా, ఎంచుకున్న అన్ని కోర్సులు ఈ అన్ని భాషల్లో అందుబాటులోకి వస్తాయి.

ప్ర. మా చర్చి ఈ స్కూల్ నుండి ఏ విధంగా ప్రయోజనం పొందుతుంది?

అధ్యయనం యొక్క స్థానిక సమూహం ప్రభావవంతమైన కార్యక్రమానికి చాలా ముఖ్యం. మీ సంఘంలో స్థానిక Through the Scriptures స్కూల్ ప్రారంభించడానికి చిట్కాలు కోసం మా ఒక పాఠశాల ఎలా ప్రారంభించాలి పేజీ చూడండి.

ప్ర. Through the Scriptures ఆన్‌లైన్ స్కూల్‌ను ఎవరు నిర్వహిస్తున్నారు?

Through the Scripturesను అర్కాన్సిస్, సియర్స్‌లో ఉన్న బహుళ కారకాల, స్వచ్ఛంద సంస్థ అయిన ట్రూత్ ఫర్ టుడే నిర్వహిస్తుంది.

ప్ర. కోర్సు రచయితలు ఎవరు?

బైబిల్ బోధించడానికి తమ జీవితాలనే అంకితం చేసిన వారి గురించి తెలుసుకోవడానికి మా రచయితలు గురించి పేజీని సందర్శించండి.


కోర్సులో నమోదు చేయడం గురించి ప్రశ్నలు

ప్ర. ఈ స్కూల్‌లో నమోదు చేసుకోవడానికి కావల్సిన అర్హతలు ఏమిటి?

ఎలాంటి అర్హతలు అవసరం లేదు. మా కోర్సుల్లో ఎవరైనా చేరవచ్చు.

ప్ర. నేను ఏ కోర్సుల్లో నమోదు చేసుకోగలను?

మీరు మేము అందుబాటులో ఉంచిన ఏ కోర్సులోనైనా నమోదు చేసుకోవచ్చు. మీరు బైబిల్ యొక్క నిర్దిష్ట పుస్తకాన్ని అధ్యయనం చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోకుంటే, మేము క్రీస్తు జీవితం, 1 తో ప్రారంభించమని సిఫార్సు చేస్తున్నాము.

ప్ర. ప్రతి కోర్సు వ్యవధి ఎంత?

మీరు కోర్సులో నమోదు చేసుకున్న సమయం నుండి ఆ కోర్సు పూర్తి చేయడానికి 50 రోజుల వరకు వ్యవధి ఉంటుంది.

ప్ర. కోర్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

మీరు మేము సూచించిన సెమిస్టర్ లేదా క్వార్టర్లీ షెడ్యూల్‌ల్లో ఒకదాని ఎంచుకోవాలని సిఫార్సు చేస్తున్నాము (మరింత సమాచారం కోసం సెమిస్టర్ స్టడీస్ చూడండి), కాని మీరు ఒక కోర్సును ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. మీరు ఒక అధ్యయన సమూహం లేదా స్థానిక TTS స్కూల్‌లో సభ్యులు అయితే, ఇతర సమూహ సభ్యులతో చర్చించండి దీని వలన మీరంతా ఒకేసారి నమోదు చేసుకోవచ్చు.

ప్ర. నేను ఒక కోర్సులో మాత్రమే నమోదు చేసుకోవచ్చా?

అవును. మీరు ప్రారంభించిన తర్వాత ఇతర కోర్సులను కూడా కొనసాగిస్తారని మాకు తెలిసినప్పటికీ, ఎప్పుడూ మీకు అనుకూలమైన రీతిలో మీరు నడుచుకోవచ్చు; మీకు స్వయంచాలకంగా ఏ కోర్సుకు నమోదు చేయబడరు లేదా ఛార్జీ వసూలు చేయబడదు.

ప్ర. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కోర్సుల్లో నేను నమోదు చేసుకోవచ్చా?

మా సిస్టమ్ మీరు ఒకసారి ఒక కోర్సుకు మాత్రమే నమోదు చేసుకునేందుకు అనుమతిస్తుంది. అయితే, మీరు ప్రస్తుత కోర్సు పూర్తి కావడానికి 50 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఒక కోర్సు పూర్తి చేసిన తర్వాత, మీకు తదుపరి కోర్సుకు కొనసాగిందుకు అవకాశం లభిస్తుంది.

ప్ర. నేను ప్రత్యేక టెక్స్ట్ పుస్తకాలు లేదా ఇతర అంశాలను కొనుగోలు చేయాలా?

మీకు కోర్సులో అవసరమయ్యే సామగ్రి అంతా అందించబడుతుంది. మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి, నేర్చుకోవాలనుకుంటే చాలు. మీరు బైబిల్ కాపీని కలిగి ఉండాలని మేము బలంగా సిఫార్సు చేస్తున్నాము, కాని ప్రతి అధ్యయన టెక్స్ట్‌లో అధ్యయనం చేసే పవిత్ర గంథ్రం యొక్క భాగం లభిస్తుంది.

ప్ర. వ్యక్తిగత ఎంపిక మరియు సెమిస్టర్ స్టడీస్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటి?

వ్యక్తిగత ఎంపికను ఏ కోర్సు చదవాలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న లేదా తమకు కావల్సిన క్రమంలో కోర్సులను పూర్తి చేయాలనుకునే వారి కోసం రూపొందించారు. సెమిస్టర్ స్టడీస్‌ను మొత్తం బైబిల్‌ను చదవడానికి ఒక ఖచ్చితమైన క్రమాన్ని అనుసరించాలనుకునే వ్యక్తులు కోసం రూపొందించారు. ఈ రెండిటీ మధ్య వ్యత్యాసం ఏమిటంటే వ్యక్తిగత ఎంపిక మీ మొదటి కోర్సు ఎంచుకునేందుకు అవకాశం ఇస్తుంది, అయితే సెమిస్టర్ స్టడీస్ మీ కోసం మొదటి కోర్సు ఎంపిక చేస్తుంది. అవి మిగిలిన అన్ని అంశాల్లోనూ ఒకే విధంగా ఉంటాయి. మేము ఈ రెండు ఎంపికలను వేర్వేరు సిఫార్సులతో అందిస్తాము ఎందుకంటే స్కూల్‌ను వేర్వేరు అవసరాలు గల విభిన్న వ్యక్తులు ఏ విధంగా ఉపయోగిస్తారో తెలియజేయాలనుకుంటున్నాము.

ప్ర. నేను వ్యక్తిగత ఎంపికలో కోర్సు ప్రారంభించి, తర్వాత సెమిస్టర్ స్టడీస్‌కు మారవచ్చా?

మీరు మారవలసిన అవసరం లేదు. మీరు ఒక కోర్సు పూర్తి చేసిన తర్వాత, స్కూల్ మీకు తదుపరి కోర్సును సూచిస్తూ, మీరు కావాలనుకుంటే వేరొక కోర్సు ఎంచుకోవచ్చని అవకాశం ఇస్తుంది. కోర్సు సమూహంలోని అన్ని కోర్సులు పూర్తయిన తర్వాత రెండు ఎంపికల్లోనూ సర్టిఫికేట్ లభిస్తుంది.

ప్ర. నేను సెమిస్టర్ స్టడీస్‌తో ప్రారంభించి, తర్వాత వేరొక కోర్సులో చేరవచ్చా?

అవును. ప్రతి కోర్సు తర్వాత, స్కూల్ తదుపరి కోర్సును సూచిస్తుంది, అలాగే మీరు కోరుకుంటే వేరొక కోర్సు ఎంచుకోవచ్చని పేర్కొంటుంది. ఎల్లప్పుడూ కోర్సు ఎంపిక మీ చేతుల్లోనే ఉంటుంది.

ప్ర. నేను అనుసరించాలనుకునే సెమిస్టర్ లేదా క్వార్టర్ పేస్‌ను ఎక్కడ ఎంచుకోవాలి?

సెమిస్టర్ మరియు క్వార్టర్లీ షెడ్యూల్‌లు అనేవి (సెమిస్టర్ స్టడీస్ పేజీలో) మీకు అనుకూలంగా ఉండే విధంగా ఎంచుకోవడానికి సిఫార్సులు మాత్రమే. మీరు వెబ్‌సైట్‌లో ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం లేదు.

ప్ర. నేను 50 రోజుల పరిమిత సమయంలో నా కోర్సు పూర్తి చేయలేకపోతే ఏమవుతుంది?

మీరు 50 రోజుల కోర్సు వ్యవధిలోపు మీ కోర్సు పూర్తి చేయలేకపోతే, మీరు తగ్గించిన ధరతో 30 రోజుల అదనపు వ్యవధిని కొనుగోలు చేయవచ్చు. అదనపు వ్యవధిని 50 రోజుల వ్యవధి పూర్తయిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయగలరు. ఒక కోర్సుకు అనుమతించే అదనపు వ్యవధులపై ఎలాంటి పరిమితి లేదు.

ప్ర. నేను కోర్సు పూర్తి చేయడానికి ముందు నా కోర్సు యాక్సెస్ ముగిసిపోతే ఏమి చేయాలి? నేను మిగిలిన దానిని పూర్తి చేయడానికి మళ్లీ చేరవచ్చా?

కోర్సు గడువు ముగిసి కొన్ని రోజులు గడిచిపోయినా సరే, మీరు వదిలివేసిన అంశం నుండి మళ్లీ కొనసాగించడానికి 30 రోజుల అదనపు వ్యవధిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.


చెల్లింపు సంబంధిత ప్రశ్నలు

ప్ర. కోర్సులో నేను నమోదు చేసుకోవడానికి ఏమైనా చెల్లించాలా?

అవును. Through the Scriptures అనేది బైబిల్ మరియు సువార్తా గ్రంథం బోధనను లక్ష్యంగా చేసుకున్న స్వచ్ఛంద సంస్థ అయిన ట్రూత్ ఫర్ టుడేచే నిర్వహించబడుతుంది. ఈ సవివర ప్రోగ్రామ్‌ను తగిన ధరకు అందించబడుతుంది. మీరు కొనుగోలు చేసే ప్రతి కోర్సుతో, మీరు కొత్త అంశాలను రూపొందించడానికి మరియు మీరు చదువుతున్న చాలా విలువైన కోర్సులను ఇతర భాషలను మాట్లాడే వ్యక్తులు చదవడానికి వీలుగా అంశాలను అనువదించడానికి ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించడానికి మరియు మద్దతుగా మాకు సహాయపడతారు.

ప్ర. కోర్సులో నమోదు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది?

ప్రతి కోర్సు కోసం ధర “నమోదు” బటన్‌తోపాటు స్పష్టంగా సూచించబడుతుంది మరియు మీరు చూసే ధరనే మేము ఛార్జ్ చేస్తాము. మేము కోర్సులో పేర్కొన ధరకు ఒక్క పైసా అదనంగా వసూలు చేయము. మీరు మా సైట్ యాక్సెస్ చేసే ప్రపంచంలోని మీ స్థానం ఆధారంగా ధర భిన్నంగా ఉంటుంది. మేము మా ధరలను నిర్ణయించే సమయంలో ప్రతి దేశం యొక్క సగటు ఆర్థిక వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా సరైన నిర్ణయాలు తీసుకున్నాము ఎందుకంటే బైబిల్‌ను దీర్ఘకాలం చదవాలనుకునే వారికి ఆర్థిక బరువు తక్కువగా ఉండేలా ఈ ప్రోగ్రామ్ యొక్క వ్యయాలను నిర్ణయించాము. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము.

ప్ర. ప్రతి కోర్సుకు నేను ఎప్పుడు చెల్లించాలి?

మీరు కోర్సులో నమోదు చేసుకోవడానికి సిద్ధంగా ఉండే సమయంలో ప్రతి కోర్సు కోసం చెల్లించాలి. మీరు ఎన్నడూ స్వయంచాలకంగా ఇతర కోర్సుల్లో నమోదు చేయబడరు లేదా స్వయంచాలకంగా ఛార్జ్ చేయబడరు.

ప్ర. ఏ చెల్లింపు విధానాలు అందుబాటులో ఉన్నాయి?

మేము Visa, MasterCard, American Express, JCB, Discover మరియు Diners Clubలను ఆమోదిస్తాము. మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై కింది లోగోల్లో ఒకటి ఉంటే, మా కోర్సుల్లో నమోదు చేసుకోవడానికి మీ కార్డును ఉపయోగించవచ్చు:

visa master card amex jcb discover diners

ప్ర. నేను US డాలర్లు కాకుండా వేరే కరెన్సీ ఉపయోగిస్తున్నప్పటికీ నేను నా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించవచ్చా?

అత్యధిక బ్యాంకులు మరియు క్రెడిట్ కార్డ్ సంస్థలు మీరు విదేశీ కరెన్సీలో కొనుగోలు చేయడానికి అనుమతిస్తాయి మరియు చెల్లింపు మీ కరెన్సీలో మొత్తానికి సర్దుబాటు చేయబడి మీ కార్డుకు ఛార్జ్ చేయబడుతుంది. మీ కార్డుకు కర్సెన్సీ మార్పిడి కోసం కొంత అదనపు రుసుము ఛార్జ్ చేయబడవచ్చని గమనించండి.


కోర్సులో చేరడం గురించి ప్రశ్నలు

ప్ర. నేను కోర్సులో చేరినప్పుడు ఏమి ఆశించవచ్చు?

కోర్సులు మీరు చదివే సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి మరియు ఇవి మేము “అధ్యయన టెక్స్ట్” అని పిలిచే డిజిటల్ టెక్స్ట్ పుస్తకాలు ఆధారంగా నిర్వహించబడతాయి. మీకు కోర్సు పూర్తి చేయడానికి 50 రోజుల వ్యవధి లభిస్తుంది, కాని మీరు చదివే వేగం ఆధారంగా మీ కోర్సు వ్యవది ఉంటుంది. మరింత సమాచారం కోసం, see our నమూనా కోర్సు విషయం పేజీ చూడండి.

ప్ర. కోర్సులో చెప్పే అంశాల ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా?

ఉన్నాయి! మా నమూనా కోర్సు విషయం పేజీ చూడండి.

ప్ర. అధ్యయన పుస్తకాలు ఉంటాయా?

ప్రతి కోర్సు కోసం అధ్యయన పుస్తకాలు PDF ఫైల్ వలె అందించబడతాయి, వాటిని ట్రూత్ ఫర్ టుడే వ్యాఖ్యాన శ్రేణిలోని వాల్యూమ్‌ల్లో ఒక దాని నుండి రూపొందిస్తారు. 350 నుండి 700 పేజీల వరకు ఉంటే ఈ ముద్రించిన రూపంలో, ఈ వాల్యూమ్‌లు ప్రవిత్ర గ్రంథం యొక్క వివరణ మరియు అనువర్తన అంశాలను కలిగి ఉంటాయి. ఈ అధ్యయన పుస్తకాలు రాబోయే కాలంలో మీ మతపరమైన గ్రంథాలయంలో విలువైన అంశాలుగా మారతాయి.

ప్ర. ప్రతి కోర్సు ముగింపులో నేను అధ్యయన పుస్తకాలను ఏమి చేయాలి?

కోర్సు సమయంలో మీరు పొందిన అధ్యయన పుస్తకాలు మరియు ఇతర డౌన్‌లోడ్ చేయగల అంశాలు మీకే స్వంతం మరియు కోర్సు తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రతి కోర్సు ముగియడానికి ముందే ఈ ఫైళ్లను మీ కంప్యూటర్‌లో సేవ్ చేసుకున్నట్లు నిర్ధారించుకోండి.

ప్ర. ముద్రించిన అధ్యయన పుస్తకాన్ని పొందడం సాధ్యమవుతుందా?

అధ్యయన పుస్తకాల యొక్క హార్డ్‌బ్యాక్ ముద్రించిన కాపీలు ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ భాషలో కోర్సుకు నమోదు చేసుకున్న యునైటెడ్ స్టేట్స్‌లోని విద్యార్థులకు డిజిటల్ కాపీతోపాటు స్వయంచాలకంగా ప్రతి కోర్సుకు ముద్రించిన పుస్తకాన్ని పొందుతారు. ముద్రించిన పుస్తకం మరియు షిప్పింగ్ వ్యయాలు కోర్సు యొక్క యు.ఎస్. ధరలో జోడించబడతాయి మీరు కోర్సుకు నమోదు చేసుకునే సమయంలో మీ షిప్పింగ్ చిరునామా అందించాలని అభ్యర్థించబడతారు.

50 రోజుల కోర్సు వ్యవధి నమోదు చేసుకున్న రోజు నుండి ప్రారంభమవుతుందని దయచేసి గమనించండి. కనుక, మీరు అధ్యయనం చేయడం ప్రారంభించడానికి మీ ముద్రించిన కాపీ అందే వరకు వేచి ఉండవద్దని మేము సిఫార్సు చేస్తున్నాము.

అధిక అంతర్జాతీయ షిప్పింగ్ వ్యయాలు కారణంగా, యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉండే విద్యార్థులు డిజిటల్ అధ్యయన పుస్తకాలను మాత్రమే అందుకుంటారు. మీరు అధిక షిప్పింగ్ వ్యయాలు ఉన్నప్పటికీ ఇంగ్లీష్ భాషలో ముద్రించిన కాపీని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు staff@resourcepublications.netకు ఇమెయిల్ పంపడం ద్వారా లేదా 1-501-305-1472కు కాల్ చేసి వనరు ప్రచురణలును సంప్రదించవచ్చు (మీరు ఫోన్ నంబర్ ప్రారంభంలో మీ దేశం యొక్క ఎగ్జిట్ కోడ్ జోడించాలి).

ప్ర. అధ్యయన పుస్తకాన్ని నేనే స్వయంగా ముద్రించుకోవచ్చా?

మీరు స్వంతంగా ఉపయోగించుకోవడానికి అధ్యయన పుస్తకం యొక్క కాపీని ముద్రించుకోవచ్చు. మీరు మరొకరికి అధ్యయన పుస్తకం కాపీ ఇవ్వరాదు లేదా పుస్తకాలను ఇవ్వరాదు. ప్రతి అధ్యయన పుస్తకం కొన్ని వందల పేజీలు ఉంటుంది, కనుక మీరే స్వయంగా ముద్రించుకోవడానికి చాలా ఎక్కువ ఇంక్ మరియు పేజీలు అవసరమవుతాయి.

ప్ర. కోర్సుల్లో ఏ విధమైన గ్రేడింగ్ విధానాన్నిఅనుసరిస్తారు?

కోర్సులో మీ ప్రగతిని ఐదు విభాగ పరీక్షలు మరియు ఒక తుది, సమగ్ర పరీక్షతో అంచనా వేయబడుతుంది. మీ తుది కోర్సు గ్రేడ్ ఈ ఆరు పరీక్షల సగటుచే నిర్ణయించబడుతుంది.

ప్ర. నా గ్రేడ్‌ల యొక్క ధృవపత్రాన్ని అందిస్తారా?

అందిస్తాము. మీరు సైట్‌కు లాగిన్ చేసినప్పుడు, మీరు వెబ్‌పేజీలోని కుడి ఎగువన నా ఖాతా మెనులో నా గ్రేడ్‌లులో చూడవచ్చు.

ప్ర. నేను ఇతర విద్యార్థులతో ఎలా చర్చించగలను?

మీరు వెబ్‌సైట్ ద్వారా నేరుగా ఇతర విద్యార్థులతో సంభాషించలేరు, కాని మేము మీరు స్థానిక TTS లేదా అధ్యయన సమూహంలో చేరాలని గట్టిగా సిఫార్సు చేస్తున్నాము. చిట్కాలు మరియు సలహాలు కోసం ఒక పాఠశాల ఎలా ప్రారంభించాలి చూడండి.


పరీక్షలు గురించి ప్రశ్నలు

ప్ర. ఎన్ని పరీక్షలు ఉంటాయి?

ప్రతి కోర్సులో ఐదు విభాగ పరీక్షలు మరియు ఒక తుది, సమగ్ర పరీక్ష ఉంటాయి.

ప్ర. నేను ప్రతి పరీక్షను ఎప్పుడు వ్రాయవచ్చు?

పరీక్షలు వ్రాయడానికి ఎలాంటి నిర్దిష్ట సమయం లేదు. మీరు ప్రతి విభాగాన్ని చదివి, విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా పరీక్షను వ్రాయవచ్చు. మీరు మొత్తం ఆరు పరీక్షలు వ్రాయడానికి 50 రోజుల వ్యవధి ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు కేటాయించిన సమయంలోనై మొత్తం ఆరు పరీక్షలు వ్రాసేందుకు సహాయంగా మేము పేసింగ్ గైడ్ అందిస్తాము.

ప్ర. ప్రతి పరీక్షలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి?

ప్రతి పరీక్షలో చాలా ముఖ్యమైన ప్రశ్నల నివేదిక నుండి యాదృచ్ఛికంగా ఎంచుకున్న 50 ప్రశ్నలు ఉంటాయి.

ప్ర. పరీక్షల్లో ఏ రకం ప్రశ్నలు ఉంటాయి?

పరీక్షలో ఇచ్చే ప్రశ్నల్లో బహుళ ఎంపికలు ఉండే మరియు ఒప్పు/తప్పు సమాధానం ఇవ్వవల్సిన ప్రశ్నలు ఉంటాయి. బహుళ ఎంపికలు ఉండే ప్రశ్నల్లో, మేము మీకు ప్రశ్నను ప్రదర్శించి, పలు ఎంపికల్లో నుండి సరైన ఎంపికను ఎంచుకోవాలని సూచిస్తాము. ఒప్పు/తప్పు ప్రశ్నల్లో, మేము ఒక వాక్యం ప్రదర్శిస్తాము మరియు మీరు నేర్చుకున్న అంశాలు ఆధారంగా అది ఒప్పో లేదా తప్పో గుర్తించాలి. కొన్ని నమూనా ప్రశ్నలను చూడటానికి మా నమూనా కోర్సు విషయం పేజీ చూడండి.

ప్ర. పరీక్షల్లో ఏ అంశం గురించి ప్రశ్నలు ఉంటాయి?

ప్రతి విభాగం కోసం, మేము మీరు చదవాల్సిన పేజీలను తెలియజేస్తాము మరియు మేము ఆ పేజీల నుండే ప్రశ్నలను సేకరిస్తాము. ప్రశ్నలను “అప్లికేషన్” లేదా “తదుపరి అధ్యయనం కోసం” అని చదవడానికి ఇచ్చిన వాటి నుండి లేదా వ్యాఖ్యాన అధ్యయన టెక్స్ట్ కాకుండా ఇతర అంశాల నుండి ప్రశ్నలను సేకరించము. సమగ్ర పరీక్షలో మొత్తం ఐదు విభాగాల పరీక్షల్లో ఉపయోగించిన అదే అంశాల్లో నుండి ప్రశ్నలు ఉంటాయి.

ప్ర. పరీక్షలకు ఎప్పుడు గ్రేడ్‌లు ఇస్తారు?

మీరు పరీక్షను పూర్తి చేసి, “సమాధానాలను సమర్పించు” క్లిక్ చేసిన తక్షణమే మీ పరీక్షలకు గ్రేడ్ ఇవ్వబడుతుంది.

ప్ర. నేను తప్పు వ్రాసిన ప్రశ్నలను చూడగలనా?

చూడగలరు. మేము మీరు తప్పు చెప్పిన లేదా సమాధానం ఇవ్వని ప్రశ్నలను గుర్తిస్తాము ఎందుకంటే ఇది మీరు నేర్చకోవడానికి చాలా సహాయపడుతుంది. సమాధానం లభించే అధ్యయన వచనాన్ని మళ్లీ చదవడం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే అదే ప్రశ్న సమగ్ర పరీక్షలో కనిపించవచ్చని కూడా గమనించండి.

ప్ర. పరీక్షలకు సమయ పరిమితి ఉందా?

లేదు. ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడానికి మీకు అవసరమైనంత సమయాన్ని తీసుకోవాలని ప్రోత్సహిస్తాము.

ప్ర. పరీక్షల కోసం సిద్ధం కావడానికి అధ్యయన మార్గదర్శకం ఏవైనా ఉందా?

ఉంది. మీరు పరీక్ష కోసం తెలుసుకోవాల్సిన కీలక పదాలు మరియు అంశాలతో ఐదు అధ్యయన మార్గదర్శకాలు లభిస్తాయి. మీరు సమగ్ర పరీక్ష కోసం సిద్ధం కావడానికి ఆ ఐదు అధ్యయన మార్గదర్శకాలను చదవాల్సిన అవసరం ఉంది. నమూనా అధ్యయన మార్గదర్శకం కోసం మా నమూనా కోర్సు విషయం పేజీ చూడండి.

ప్ర. నేను పరీక్షలకు హాజరయ్యేటప్పుడు నా బైబిల్, నోట్సు నుండి లేదా ఇతర సహాయం పొందవచ్చా?

లేదు, మీరు పరీక్షను ప్రారంభించడానికి ముందు మీ బైబిల్, నోట్సు మరియు అధ్యయన అంశాలను దూరంగా పెట్టాలి.

ప్ర. తదుపరి సెక్షన్‌కు అర్హత సాధించడానికి పరీక్షలో నేను ఎంత స్కోర్ చేయాలి?

విద్యార్థులు కోర్సులోని తదుపరి విభాగానికి కొనసాగడానికి పరీక్షలో కనీసం 70% స్కోర్ చేయాలి. మా స్కూల్ యొక్క లక్ష్యం మీరు అంశాలను నేర్చుకోవాలని కాబట్టి, మీరు 70% కంటే తక్కువ స్కోర్ చేసినట్లయితే మళ్లీ అధ్యయనం చేసి, పరీక్షను మళ్లీ వ్రాయవచ్చు. మీరు పరీక్షకు హాజరైన ప్రతిసారి ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఎంచుకోబడతాయి, కనుక మీరు మొదటిసారి హాజరైన పరీక్షలోని ప్రశ్నలకు తదుపరిసారి పరీక్షలోని ప్రశ్నలు భిన్నంగా ఉంటాయి. మీరు తదుపరి విభాగానికి వెళ్లడానికి అవసరమైన అన్నిసార్లు పరీక్షను మళ్లీ మళ్లీ వ్రాయవచ్చు, కాని మీరు బాగా అధ్యయనం చేసి, అర్థం చేసుకుని మొదటిసారే ఉత్తీర్ణత సాధించాలని ప్రోత్సహిస్తున్నాము ఎందుకంటే మీరు పరీక్షకు ఎన్నిసార్లు హాజరయ్యారో సిస్టమ్ ట్రాక్ చేస్తుంది. సమగ్ర పరీక్షను మళ్లీ వ్రాసే అవకాశం మీకు ఉండదని దయచేసి గమనించండి.

ప్ర. నేను 70% లేదా అంత కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించినప్పటికీ నేను మళ్లీ పరీక్షకు హాజరు కావచ్చు?

కాలేరు. మీరు ఒక పరీక్షలో కనీసం 70%తో ఉత్తీర్ణత సాధిస్తే, ఆ గ్రేడే మీకు వర్తిస్తుంది.

ప్ర. నేను సమగ్ర పరీక్షకు ఎలా హాజరు కాగలను?

మీరు అంశం అర్థం చేసుకునేందుకు సహాయంగా మీరు ఉత్తీర్ణత సాధించే వరకు ఐదు విభాగ పరీక్షలను మళ్లీ మళ్లీ వ్రాసే అవకాశం ఇస్తాము. అయితే, మీరు 70% కంటే తక్కువ స్కోర్ చేసినప్పుటికీ సమగ్ర పరీక్షను మళ్లీ వ్రాయలేరు. ఈ తుది పరీక్ష మీరు కోర్సులో నేర్చుకున్న అంశాలను నిర్ధారించడంలో సరైన కొలమానంగా చెప్పవచ్చు.

ప్ర. పరీక్షకు హాజరవుతున్న సమయంలో నా కంప్యూటర్ విఫలమైతే లేదా ఇంటర్నెట్ పోతే ఏమవుతుంది?

మీరు సమస్య పరిష్కరించబడిన తర్వాత పరీక్షను మళ్లీ ప్రారంభించగలరు. మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్థిరంగా లేకపోతే, మీరు ఆఫ్‌లైన్‌లో పరీక్షకు సమాధానాలు ఇచ్చి, మీ కనెక్షన్ మళ్లీ వచ్చిన తర్వాత మీ సమాధానాలను సమర్పించవచ్చు.


సాంకేతిక ప్రశ్నలు

ప్ర. ఈ వెబ్‌సైట్ ఉపయోగించడానికి అవసరమైన కనీస కంప్యూటర్ అవసరాలు ఏమిటి?

మా వెబ్‌సైట్ దాదాపు మూడు ప్రధాన బ్రౌజర్‌లు (Google Chrome, Firefox, Internet Explorer, Opera, లేదా Safari) యొక్క తాజా సంస్కరణలకు అనుకూలంగా పని చేసేలా రూపొందించబడింది. మీ కంప్యూటర్ ఈ బ్రౌజర్‌ల్లో ఒకదానితో అనుకూలంగా పని చేస్తే, మీరు ఆన్‌లైన్ స్కూల్‌ను యాక్సెస్ చేయగలరు. సాధారణ సూచనగా, మీరు మీ కంప్యూటర్‌లో ఈ సైట్ యొక్క పబ్లిక్ పేజీలను చూడగలిగితే మరియు మీరు నమూనా కోర్సు విషయాలను డౌన్‌లోడ్ చేసి, చూడగలిగితే, మీరు మీ కంప్యూటర్‌తో మా ఆన్‌లైన్ స్కూల్‌ను తప్పక యాక్సెస్ చేయగలరు.

ప్ర. నాకు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు నేను చదవగలనా?

మీరు ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి, పరీక్షలకు హాజరు కావడానికి మరియు కోర్సులో ముందుకు సాగడానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. మీరు అత్యధిక సమయం అధ్యయన వచనాన్ని చదవడానికి మరియు పరీక్ష కోసం సిద్ధం కావడానికి వెచ్చిస్తారు మరియు మీరు నిర్దిష్ట విభాగం కోసం అధ్యయన వచనాన్ని మరియు అధ్యయన మార్గదర్శకాన్ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఆఫ్‌లైన్‌లో చదువుకోవచ్చు.

ప్ర. నేను Through the Scripturesతో చదవడానికి నా మొబైల్ లేదా ట్యాబ్లెట్ ఉపయోగించగలనా?

మా వెబ్‌సైట్ మూడు ప్రధాన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ (Android మరియు iOS వంటివి)కు అనుకూలంగా పని చేసేలా రూపొందించబడింది. ఇంకా, మీరు PDF ఫైల్‌లను చూడాల్సిన అవసరం ఉంది, దీని కోసం పలు అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో చాలా వరకు ఉచితం. మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ ఈ అనుకూలతను కలిగి ఉంటే, మీరు ఈ ఆన్‌లైన్ స్కూల్ కోసం దానిని ఉపయోగించవచ్చు. సాధారణ సూచన వలె, మీరు మీ పరికరంతో ఈ సైట్ యొక్క పబ్లిక్ పేజీలను చూడగలిగితే మరియు మీరు నమూనా కోర్సు విషయం డౌన్‌లోడ్ చేసి, చూడగలిగితే, మీరు మీ పరికరంతో మా వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయగలరు.

ప్ర. నా ఖాతాకు సంబంధించిన నా పాస్‌వర్డ్ లేదా ఇమెయిల్ చిరునామా మార్చగలనా?

మీరు మీ ఇమెయిల్ చిరునామా లేదా పాస్‌వర్డ్‌ను ఇక్కడ మార్చవచ్చు.

ప్ర. నేను అధ్యయన వచనాన్ని చూడలేకపోతున్నాను లేదా అది సరిగ్గా కనిపించడం లేదు. నేను ఏమి చేయాలి?

డిజిటల్ అధ్యయన వచనాలను PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి. మీరు ఈ ఫైల్‌లను తెరవడానికి PDF రీడర్ అవసరం. PDFను తెరవడంలో మీకు సమస్య ఉంటే లేదా మీరు వచనాన్ని కప్పివేసే తెలుపు రంగు పెట్టెలు వంటి దోషాలను ఎదుర్కొంటుంటే, మేము ఉచిత Adobe Reader యొక్క ప్రస్తుత సంస్కరణను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోమని సిఫార్సు చేస్తున్నాము.

ప్ర. వెబ్‌సైట్ సరిగ్గా పని చేయడం లేదు. నేను ఏమి చేయాలి?

ముందుగా, మీకు Google Chrome, Firefox, Safari, లేదా Opera యొక్క తాజా సంస్కరణ అమలు అవుతున్నట్లు నిర్ధారించుకోండి. సమస్య కొనసాగినట్లయితే, దయచేసి దోషాన్ని మాకు మా మద్దతు పేజీలో తెలియజేయండి. దయచేసి దోషాన్ని నివేదిస్తున్నప్పుడు ఖచ్చితమైన అంశాలను అందించండి. మీరు ఉపయోగిస్తున్న బ్రౌజర్ యొక్క సంస్కరణను, కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్‌ను (ఉదాహరణకు, Windows 8 లేదా Mac OS 10.10 Yosemite), సమస్యను సృష్టించిన పేజీ యొక్క వెబ్ చిరునామా, సమస్య యొక్క వివరణ మరియు మీరు సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న ఏవైనా చర్యలు గురించి మాకు తెలియజేయండి.

ప్ర. నా వ్యక్తిగత సమాచారం సంరక్షించబడుతుందా?

మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాము. మీ కంప్యూటర్ నుండి మా వెబ్‌సైట్ డేటా కనెక్షన్ ఎన్క్రిప్ట్ చేయబడుతుంది మరియు SSL సాంకేతికతో సంరక్షించబడుతుంది. మీ ఆర్థిక సమాచారం మా సర్వర్‌ల్లో నిల్వ చేయబడదు మరియు మీ చెల్లింపు విశ్వసనీయ, సంస్థాగత-ప్రమాణ చెల్లింపు ప్రాసెసర్‌చే నిర్వహించబడుతుంది.


మద్దతు ప్రశ్నలు

ప్ర. నేను ప్రారంభించిన కోర్సును ఎలా తిరిగి కొనసాగించగలను?

మీరు లాగిన్ చేయకుంటే, ఈ వెబ్‌పైజి కుడి ఎగువన ఉన్న లాగిన్ లింక్ ఉపయోగించి లాగిన్ చేయండి లేదా మీరు ఇప్పటికే లాగిన్ అయ్యి ఉంటే, ఈ వెబ్‌పేజీ కుడి ఎగువన ఉన్న నా ఖాతాను క్లిక్ చేయండి. నా ఖాతా పేజీ నుండి, ఎరుపు రంగులో ఉన్న కోర్సు కొనసాగించు బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీరు మీ ప్రస్తుత కోర్సు యొక్క మొదటి పేజీకి వెళతారు. అక్కడ నుండి, మీరు వదిలివేసిన దశను ఎంచుకోవచ్చు.

ప్ర. నేను ఇప్పటికే పూర్తి చేసిన కోర్సులో మళ్లీ చేరవచ్చా?

చేరలేరు. అయితే, మీరు గతంలో నేర్చుకున్న అంశాలను మళ్లీ ఒకసారి మననం చేసుకోవడానికి అధ్యయన వచనాన్ని మళ్లీ సందర్శించాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

ప్ర. నేను నా అధ్యయన వచనం యొక్క నా డిజిటల్ కాపీని కోల్పోయాను. నేను మరొక కాపీని ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

మీరు ప్రస్తుతం నమోదు చేసుకున్న కోర్సులో ఉన్నప్పుడు మొత్తం కోర్సు అంశాలకు పూర్తి యాక్సెస్ కలిగి ఉంటారు. మీరు మీ ప్రస్తుత కోర్సులో ప్రారంభించడం పేజీ నుండి మళ్లీ అధ్యయన వచనాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ డౌన్‌లోడ్ చేసిన అన్ని ఫైల్‌లను మీ కంప్యూటర్‌లో ఒక సురక్షితమైన స్థలంలో సేవ్ చేయండి దీని వలన మీరు యాక్సెస్ కోల్పోయినప్పటికీ వాటిని కలిగి ఉంటారు. కంప్యూటర్ వైఫల్యం సమయంలో అంశాలను కోల్పోకుండా నివారించడానికి వాటి బ్యాకప్ కాపీలను కూడా తీసుకుని జాగ్రత్త చేసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

ప్ర. నేను అధ్యయన వచనం యొక్క నా డిజిటల్ కాపీని కోల్పోయాను మరియు నా కోర్సు యాక్సెస్ గడువు ముగిసింది. నేను మరొక కాపీ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

కోర్సు గడువు ముగిసిన తర్వాత మళ్లీ అంశాలకు యాక్సెస్ పొందడానికి ఉన్న ఒకే అవకాశం తక్కువ రుసుముతో కోర్సును పునరుద్ధరించుకోవడమే. మీరు ఈ విధంగా నా ఖాతా పేజీ నుండి చేయవచ్చు. మీరు మరొక కోర్సుకు ప్రస్తుతం నమోదు చేసుకుని ఉంటే, మీరు మరొక దానిని పునరుద్ధరించడానికి ముందు ఆ కోర్సును పూర్తి చేయాలి, ఎందుకంటే మీరు ఒకసారి ఒక కోర్సులో మాత్రమే నమోదు చేసుకోగలరు. మీరు మీ కోర్సును పునరుద్ధరించుకున్న తర్వాత, మీరు కోల్పోయిన ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి కోర్సులోని ఏదైనా పేజీలను మళ్లీ సందర్శించవచ్చు.

ప్ర. నేను నా పాస్‌వర్డ్ మరిచిపోయాను. నేను నా ఖాతాలోకి మళ్లీ ఎలా ప్రవేశించగలను?

మీరు మీ పాస్‌వర్డ్‌ను ఇక్కడ రీసెట్ చేయవచ్చు. మీరు మీ ఇమెయిల్ చిరునామా లేదా వినియోగదారు పేరు నమోదు చేసిన తర్వాత, మేము మీ పాస్‌వర్డ్ రీసెట్ చేయడానికి లింక్ గల ఒక ఇమెయిల్ పంపుతాము.

ప్ర. నేను సైన్ అప్ చేసినప్పుడు ఉపయోగించిన ఇమెయిల్‌కు ఇకపై యాక్సెస్ లేదు. నేను నా ఖాతాలోకి మళ్లీ ఎలా ప్రవేశించగలను?

మీకు మీ పాత ఇమెయిల్ ఖాతాకు యాక్సెస్ లేనప్పటికీ, మీరు ఇప్పటికీ మీ పాత ఇమెయిల్ చిరునామాను నమోదు చేసి వెబ్‌సైట్‌కు లాగిన్ చేయవచ్చు. అప్పుడు, నా ఖాతా పేజీ నుండి, మీ ఖాతాను కొత్త ఇమెయిల్ చిరునామాకు మార్చడానికి మీ పాస్‌వర్డ్ మరియు ఖాతా వివరాలను సవరించండి. మీరు తర్వాత మీ కొత్త ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి వెబ్‌సైట్‌కు లాగిన్ చేయగలరు.

ప్ర. నేను నా ఖాతాను మరొకరితో పంచుకోవచ్చా?

లేదు. ప్రతి వ్యక్తికి అతని లేదా ఆమె స్వంత ఖాతా ఉండాలి.

ప్ర. నేను నా ఖాతాను మరొక వ్యక్తి బదిలీ చేయగలనా?

లేదు. ప్రతి వ్యక్తికి అతని లేదా ఆమె స్వంత ఖాతా ఉండాలి.

ప్ర. నాకు మద్దతు ఎక్కడ లభిస్తుంది?

దయచేసి మీ ప్రశ్నకు ఇప్పటికే సమాధానం ఇవ్వలేదని నిర్ధారించుకోవడానికి ఈ తరచుగా అడిగే ప్రశ్నలను జాగ్రత్తగా శోధించండి. మీరు స్థానిక TTS స్కూల్‌లో లేదా అధ్యయన సమూహంలో సభ్యులు అయితే, మీరు సమూహం యొక్క డీన్‌ను లేదా ఇతర సమూహ సభ్యుడిని సహాయం కోసం అభ్యరించవచ్చు. మీకు అప్పటికీ సహాయం అవసరమైతే, మీరు మమ్మల్ని మా మద్దతు పేజీలో సంప్రదించవచ్చు. దయచేసి మేము ప్రతిస్పందించడానికి మాకు కొన్నిరోజుల వ్యవధిని ఇవ్వండి ముఖ్యంగా మీరు మా నుండి ఇంగ్లీష్‌లో కాకుండా ఇతర భాషల్లో సమాధానాన్ని ఊహిస్తే.