ఒక పాఠశాలను ఎలా ప్రారంభించాలి

మీరు మీ నివాస ప్రాంతంలోని సమూహం లేదా సంఘం కోసం Through the Scriptures (TTS) పాఠశాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నారా? మీరు ప్రారంభించడానికి కొన్ని ఆలోచనలను మేము అందిస్తాము!


నా సమూహం లేదా సంఘం కోసం నేను స్థానిక Through the Scriptures పాఠశాలను ఎందుకు ఏర్పాటు చేయాలి?

Through the Scripturesను విద్యార్థి అతని లేదా ఆమె స్వంత సామర్థ్యం ఆధారంగా అధ్యయనం చేయడానికి వీలుగా రూపొందించబడింది, చాలా మంది వ్యక్తులు సమూహంగా కలిసి అధ్యయనం చేయడం వలన ప్రయోజనాలు పొందుతారు. సభ్యులు మరియు సమూహం మాత్రమే కాకుండా, వ్యక్తిగత అధ్యయనం కంటే పలు మార్గాల్లో సమూహ అధ్యయనం వ్యక్తులను ప్రోత్సహిస్తుంది మరియు ప్రేరేపిస్తుంది. స్థానిక TTS పాఠశాలను ఏర్పాటు చేయడం వలన సాధ్యమయ్యే మానవ విలువలు చాలా మార్పులు తీసుకుని వస్తాయని మా అభిప్రాయం.


ఒక పాఠశాలను ఏర్పాటు చేయడానికి విభిన్న మార్గాలు ఏమిటి?

 • సాధారణ పాఠశాలను ఏర్పాటు చేయండి, దీనిలో ఒక కోర్సుకు 50 రోజులను వెచ్చించి మొత్తం బైబిల్‌ను అధ్యయనం చేయాలనుకునే చర్చి సభ్యులను చేరుకోవచ్చు. మరింత సమాచారం కోసం సెమిస్టర్ స్టడీస్ పేజీ చూడండి.
 • పూర్తి స్థాయి పాఠశాలను ఏర్పాటు చేయండి, దీనిలో విద్యార్థులు పూర్తిగా రెండు నుండి మూడు సంవత్సరాలపాటు బైబిల్ అధ్యయనం చేయడానికి సభ్యులను చేర్చుకోవచ్చు. విద్యార్థులు ఒక కోర్సుకు 14 రోజులచొప్పున వెచ్చించినట్లయితే, బైబిల్ యొక్క ప్రతి పుస్తకాన్ని సుమారు రెండు సంవత్సరాల 3 నెలల సమయంలో క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు. దీనికి విద్యార్థుల శ్రద్ధతో కృషి చేయాలి మరియు ప్రతి విద్యార్థి జీవనానికి అవసరమైన ఖర్చులకు మద్దతు అవసరం కావచ్చు.
 • కోర్సులను అవసరం ఆధారంగా నిర్వహించండి. హ్రీబూస్‌లో బైబిల్ తరగతిని బోధించడానికి ఒక సభ్యుడు సిద్ధమవుతున్నారా? అతన్ని హీబ్రూస్‌పై మా కోర్సులో నమోదు చేయండి, ఆపై తరగతిలో సభ్యుల సంఖ్యను పెంచడానికి అతని తరగతిలోకి సమగ్ర అధ్యయనం కోసం సభ్యులను ఆహ్వానించాలని సూచించండి! సమూహం కొత్త నాయకులను నియమిస్తుందా? సభ్యులను 1 మరియు 2 టిమోథే మరియు టిటస్‌లపై మా కోర్సుల్లో చేరమని ప్రోత్సహించండి! మీరు క్రైస్తవులు బైబిల్ అధ్యయనాన్ని జీవన పర్యంత అభిరుచిగా మలుచుకోవాలని భావిస్తున్నారా? మా లైఫ్ ఆఫ్ క్రీస్ట్ మరియు యాక్ట్స్ కోర్సులు ప్రారంభించడానికి ఉత్తమ అంశాలు!
 • దీనిని బైబిల్ అధ్యయనంలో సమగ్ర అవగాహన కల్పించడానికి మహిళల తరగుతులలో ఉపయోగించండి.
 • దీనిని వేసవి సమయంలో ఉన్నత పాఠశాల సమూహాలు కోసం ఉపయోగించండి, నిర్దిష్ట గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించడానికి స్నేహపూర్వక పోటీ లేదా ఏదో ఒక రూపంలో ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఉత్తమంగా ఉంటుంది. మేము ఈ వయస్సులోని వారికి గాస్పెల్స్ లేదా యాక్ట్స్ కోర్సులను సిఫార్సు చేస్తున్నాము.
 • ఎదిగిన పిల్లలు గల దంపతులు మరియు కుటుంబాలు ఏకకాలంలో కోర్సుల్లో చేరవచ్చు మరియు అధ్యయనం మరియు చర్చల కోసం తరచూ సమావేశం కావచ్చు.
 • దీనిని స్థానిక సువార్త గంథ్ర పఠనం వేదికగా చేయండి. కొన్నిసార్లు వ్యక్తులు వ్యక్తిగత బైబిల్ అధ్యయనంలో లేదా నిర్దిష్ట ప్రార్థన సేవలో పాల్గొనడానికి ఆసక్తి చూపని వారు “అధ్యయన సమూహం”లో పాలు పంచుకోవడానికి ఇష్టపడవచ్చు. ఈ విధంగా, వారు కోర్సుల్లో నేర్పే అంశాలను అర్థం చేసుకోగలరు, సమావేశాల్లోని చర్చల్లో పాల్గొనగలరు మరియు ఇతరులతో సంబంధాలను మెరుగుపర్చుకోగలరు, ఈ విధంగా తదుపరి అధ్యయనంపై ఆసక్తి కలగవచ్చు. బైబిల్‌లోని సమగ్ర కోర్సులపై ఆసక్తి కలిగి ఉండే సంఘంలోని వ్యక్తులను కనుగొనడానికి ప్రయత్నించండి. నిర్దిష్ట చర్చి భవనానికి రావడానికి భయపడే వ్యక్తులను ప్రోత్సహించడానికి వీలుగా బహిరంగ ప్రదేశాలు వంటి “తటస్థ” ప్రాంతాల్లో మీ సమావేశాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించండి.
 • ఈ కోర్సులు మిషన్ రంగంలో చాలా సహాయపడతాయి. సాధారణంగా మతపరమైన శిక్షణ అరుదుగా లభిస్తుంది లేదా ఎక్కువ స్థానాల్లో అందుబాటులో ఉండదు, కాని ఈ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా 23 భాషల్లో అందుబాటులో ఉంది. యువ సంఘాలు మా కోర్సులు అందించే సమగ్ర బైబిల్ అధ్యయనంతో చాలా ప్రయోజనాలను ఆర్జిస్తారు. స్థానిక పాఠశాలను ఏర్పాటు చేయడం వలన ప్రత్యేకంగా వారిలో మంచి అధ్యయన అభిరుచులను ప్రోత్సహించడంలో దోహదపడుతుంది. మీరు మద్దతు ఇచ్చే మిషనరీలకు ఈ ప్రోగ్రామ్ గురించి తప్పక తెలియజేయండి!
 • మా కోర్సులను ఇతర ప్రోగ్రామ్‌లకు మద్దతుగా పాఠ్య ప్రణాళిక వలె కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, విదేశాల్లో బోధకుని శిక్షణా ప్రోగ్రామ్‌లో ఆ ప్రోగ్రామ్‌లోని మొత్తం అధ్యయన అనుభవాన్ని పొందడానికి మా కోర్సుల్లో కొన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉండవచ్చు.

నేను ఎలా ప్రారంభించాలా?

Through the Scriptures ద్వారా నిర్వహించగల, ప్రోత్సహించగల మరియు బైబిల్ అధ్యయనం గురించి ఉత్సాహం గల వ్యక్తిని (మీరు కూడా కావచ్చు) సమూహం యొక్క “డీన్” వలె సేవ చేయడానికి నియమించండి. డీన్‌కు నాలుగు విధులు ఉంటాయి:

 1. సమూహంలో చేరడానికి వ్యక్తులను ఆహ్వానించాలి.
 2. సమూహ సమావేశాలను నిర్వహించాలి.
 3. అధ్యయనంలో కొనసాగడానికి సమూహ సభ్యులను ప్రోత్సహించాలి.
 4. అవసరమైనప్పుడు సమూహ సభ్యులకు కోర్సులను అధ్యయనం చేయడంలో సహాయపడాలి, ఉదాహరణకు, కంప్యూటర్ ఉపయోగించడంలో, ThroughTheScriptures.comలో ఒక ఖాతా రూపొందించడానికి లేదా ఇతర ఆన్‌లైన్ విధుల్లో సహాయపడాలి.

నేను వ్యక్తులు చేరడానికి వారిని ఎలా ఉత్తేజపరచాలి?

ప్రచారం చేయండి. ఒక సమావేశంలో ప్రకటించండి మరియు చర్చి బులెటిన్‌ల్లో, PowerPoint ప్రకటనలు మరియు మీ చర్చి వెబ్‌సైట్‌లో ప్రకటించండి. పాల్గొనేలా చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏమిటంటే అత్యంత ఆసక్తి గల వ్యక్తులతో నేరుగా మాట్లాడి ప్రోత్సహించడమే.

అలాగే ఇతర సంఘాలతో కూడా చర్చించండి. సాధ్యమైతే, ప్రతి సంఘంలోనూ తన సంఘంలో ప్రచారాన్ని విస్తరించడానికి సహాయం చేసే వ్యక్తిని కలుసుకోండి. మీరు చర్చి వెలుపల కూడా వ్యక్తులను ఆహ్వానించడానికి ప్రయత్నించాలి. లార్డ్స్ చర్చిలో సభ్యులు కాని చాలా మంది ఈ రకం బైబిల్ అధ్యయనంలో అమితమైన ఆసక్తి కలిగి ఉంటారు మరియు ఇది మీతో బైబిల్ అధ్యయనం చేయడానికి వారిని ప్రేరేపించేందుకు అత్యుత్తమ అవకాశంగా చెప్పవచ్చు.

ప్రత్యేకంగా బైబిల్ అధ్యయనంలో అమితమైన ఆసక్తి గల చర్చి యొక్క ఎల్డర్‌ల్లో ఒకరిని కలుసుకోండి మరియు స్వయంగా ఒక కోర్సులో చేరాలని వారిని ఆహ్వానించండి. ఆయన ఒక కోర్సు పూర్తి చేసినట్లయితే, ఆయన పాఠశాలను ఏర్పాటు చేయాలనే మీ ప్రయత్నానికి మీ అతిపెద్ద మద్దతుదారుల్లో ఒకరిగా మారతారు.

పాల్గొనాలనుకునే ఒక సంఘం కొంత మంది లేదా మొత్తం సంఘ సభ్యులందరి మొదటి కోర్సు కోసం చెల్లించాలనుకోవచ్చు. దీని వలన ఆర్థికంగా వెనుకబడిన వారి యొక్క అత్యంత ముఖ్యమైన సమస్య తొలగిపోతుంది. సంఘం ప్రతి కోర్సులోనూ నిర్దిష్ట గ్రేడ్ ఆర్జించిన వ్యక్తులు తదుపరి కోర్సుల కోసం చెల్లింపు కొనసాగించాలనుకోవచ్చు, ఇది బైబిల్ అధ్యయనంలో నిరంతర శ్రద్ధను ప్రోత్సహిస్తుంది.


నేను ఆసక్తి గల వ్యక్తులను కలుసుకున్న తర్వాత, మేము ఏమి చేయాలి?

చేరాలనుకునే TTS కోర్సులు గురించి కలిసి నిర్ణయం తీసుకోండి మరియు ప్రారంభించడానికి ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉండే ఒక రోజును ఎంచుకోండి, దీని వలన మీరందరూ కలిసి అధ్యయనం చేయగలరు. ఏ విధంగా సైన్ అప్ చేయాలో వివరించండి మరియు సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయండి.

ప్రతి వారం సమావేశాన్ని నిర్వహించండి. కొన్ని సమూహాలు చర్చి యొక్క ప్రార్థనా సేవల్లో ఒకదానికి గంట ముందు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇతరులు ఒక వారంలో రాత్రిపూట లేదా మరొక సమయాన్ని ఎంచుకుంటారు. పాల్గొనాలనుకునే వారికి అనుకూలమైన సమయాన్ని ఎంచుకోండి. అదే విధంగా సమావేశ స్థలాన్ని కూడా అందరికీ అనుకూలంగా ఉండేలా చూసుకోండి: ఉదాహరణకు చర్చి భవనంలో కలుసుకోవడం, కొంత మంది సభ్యుల ఇళ్లల్లో లేదా మరొక స్థలంలో కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు.


ప్రతి వారం నిర్వహించే సమావేశాల్లో మేము ఏమి చేయాలి?

ప్రధాన లక్ష్యం కోర్సుల అధ్యయనానికి మద్దతు ఇవ్వడం మరియు ప్రోత్సహించడం. మీరు పరీక్షల కోసం సిద్ధం కావడానికి అధ్యయన మార్గదర్శకాలను చదవాలి, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండే అంశాలను అర్థం చేసుకోవడంలో ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలి.

అత్యధిక సమూహాలు ఈ సమయంలో కలిసి ప్రత్యేకంగా ఆ వారం కోర్సులో అధ్యయనం చేసిన ఏదైనా అంశంపై ఆధ్యాత్మిక సందేశం గురించి చర్చిస్తారు. ప్రతి వారం ఆధ్యాత్మిక సందేశాన్ని వివరించడానికి వేర్వేరు సభ్యులు ప్రాతినిధ్యం వహించాలి.

మీ ప్రతి వారం ఏర్పాటు చేసుకునే సమావేశం యొక్క అత్యంత ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఏమిటంటే సభ్యులను మరియు సన్నిహితులను ప్రోత్సహించడమే, అంతే కాకుండా మీరు కొన్నిసార్లు ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయవచ్చు, కాఫీ, పలహారాలు వంటివి లేదా కోర్సు పూర్తయిన తర్వాత ఉత్సాహంతో భోజనాలను ఏర్పాటు చేయవచ్చు. ఈ అదనపు అంశాలు మీ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యాలను ఆటంకపరచకుండా లేదా చర్చించే సమయానికి వ్యక్తులు వెళ్లిపోకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.


ఈ ఆలోచనలు సూచనలు మాత్రమే. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉత్తమ అంశం ఏమిటంటే మీ అవసరాలకు తగినట్లు మీ స్థానిక పాఠశాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రాథమిక అంశాలను అందించడమే.

మా ఆలోచనల్లో ఏవైనా లేదా మీ స్వంత కార్యాచరణల్లో ఏదైనా ఉత్తమమైన ఫలితాన్ని అందించాయా? మేము దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము! దయచేసి మా అభిప్రాయం పేజీలో మాకు తెలియజేయండి.