మా రచయితలు గురించి

 


ఎడ్డీ క్లోయెర్

ఎడ్డీ క్లోయెర్ సీయర్సే, అర్కాన్సాస్‌లో హార్డింగ్ విశ్వవిద్యాలయంలో; ఓక్లాహోమ్ నగరంలోని ఓక్లాహోమా క్రిస్టియన్ విశ్వవిద్యాలయంలో; మరియు టెన్నేసీ, మెమ్ఫిస్‌లోని హార్డింగ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ స్కూల్‌లో చదివారు. ఆయన B.A., M.Th., మరియు D.Min. డిగ్రీలను పూర్తి చేశారు. అతను సమగ్ర పరిశీలనలో సువార్త గ్రంథ బోధనపై దృష్టి సారించారు. పదిహేను సంవత్సరాల వయస్సులో బోధనను ప్రారంభించి, అతను నలభై సంవత్సరాలుగా గాస్పెల్‌ను బోధిస్తూ క్లార్క్స్‌విల్లే, హాట్ స్ప్రింగ్స్ మరియు బ్లేథివిల్లే, అర్కాన్సాస్‌ల్లోని సమూహాలకు సేవలను అందించారు. ఆయన యుఎస్ఎలోని ముప్పై-ఐదు రాష్ట్రాల్లో మరియు ఇంగ్లాండ్, సింగపూర్, ఉక్రెయిన్ మరియు భారతదేశాలతోసహా పలు ఇతర దేశాల్లో 850 కంటే ఎక్కువ గాస్పెల్ సమావేశాల్లో బోధించారు. క్లోయెర్ హార్డింగ్ విశ్వవిద్యాలయంలో బైబిల్ బోధిస్తారు మరియు బోధన తరగతులను నిర్వహిస్తారు. 1981 నుండి, క్లోయెర్ బోధకులు మరియు శిక్షకులు కోసం ఒక నెలవారీ ప్రచురణ అయిన ట్రూత్ ఫర్ టుడేను సవరించారు మరియు ప్రచురించారు. 1990లో, వరల్డ్ బైబిల్ స్కూల్ బోధకులు మరియు టెక్సాస్, హౌస్టన్‌లోని ఛాంపియన్స్ చర్చ్ ఆఫ్ క్రిస్ట్ సహాయంతో, ఆయన ట్రూత్ ఫర్ టుడేను ప్రారంభించారు. ఇది 140 కంటే ఎక్కువ దేశాల్లోని సుమారు 40,000 మంది బోధకులు మరియు శిక్షకులకు శీఘ్రంగా బైబిల్ అధ్యయనాల్లో సహకారం అందించింది.
Eddie Cloer

సెల్లెర్స్ S. క్రెయిన్, Jr.

డా. సెల్లెర్స్ S. క్రాయిన్ Jr., యాభై సంవత్సరాలుగా భోధిస్తున్నారు మరియు ప్రసంగిస్తున్నారు మరియు లూసియానా, అలబామా, కెంటకీ మరియు టెన్నెస్సీలోని సమూహాలకు సేవలు అందించారు. ఆలబామాలోని ఏథెన్స్ స్టేట్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ చేసి, క్రాయిన్ అలబామా క్రిస్టియన్ స్కూల్ ఆఫ్ రిలిజియన్ (ఇప్పుడు అమ్రిడ్జ్ విశ్వవిద్యాలయం) మరియు లూథర్ రైస్ సెమినారీ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈయన డీర్ఫీల్డ్, ఇల్లినోయిస్‌లోని ట్రినిటీ ఇవాంజెలికల్ డివైనిటీ స్కూల్ (ఇప్పుడు ట్రినిటీ ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయం)లో తన D.Min. డిగ్రీ పొందారు. క్రాయిన్ టెన్నీసీ పబ్లిక్ స్కూల్ సిస్టమ్‌లో మరియు పలు బైబిలికల్ అధ్యయనాల స్కూల్‌ల్లో ఒక శిక్షకుడుగా పని చేస్తున్నారు, గుయిన్, అలబామాలోని స్కూల్ ఆఫ్ వరల్డ్ ఇవాంజెలిజమ్ కోసం మరియు మాడిసన్, టెన్నీసీలో మిడ్-సౌత్ స్కూల్ ఆఫ్ బైబిలికల్ అధ్యయనాల డైరెక్టర్‌గా సేవలు అందించారు. ఈయన ఉక్రెయిన్, గ్రీస్, పెరూ మరియు పనామాల్లో కూడా బోధించారు మరియు పదకొండు దేశాలకు ఇరవై మూడు మిషన్ పర్యటనలను చేశారు. ఉత్తమ రచయిత అయిన క్రాయిన్ 1,500 కంటే ఎక్కువ కథనాలను మరియు ముప్పై-ఏడు బోధన ప్రణాళిక పుస్తకాలను రచించారు. ఈయన కథనాలు గాస్పెల్ అడ్వకేట్ మరియు పవర్ ఫర్ టుడేలతోసహా పలు జర్నల్‌ల్లో ప్రచురించబడ్డాయి. ఐదు సంవత్సరాలపాటు, ఈయన ఒక వార్షిక వయోజన పాఠ్య వ్యాఖ్యానం అయిన గాస్పెల్ అడ్వకేట్ కంపేనియన్ వ్రాశారు. ఈయన ది వరల్డ్ ఇవాంజెలిస్ట్ కోసం బోర్డులో పని చేశారు మరియు 21వ శతాబ్ద క్రిస్టియన్ కోసం జూనియర్ మరియు సీనియర్ హై బైబిల్ తరగతి అంశాలను సవరించారు. ఇంకా, ఈయన పలు ప్రసంగాల్లో, గాస్పెల్ సమావేశాల్లో మరియు ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రసంగించారు. ఈయన పాఠాలు రేడియో మరియు టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా ప్రసారమయ్యాయి. సెల్లెర్స్ మరియు ఆయన భార్య వాండా 1961లో వివాహం చేసుకున్నారు. వారు ముగ్గురు పిల్లలను మరియు నలుగురు మనమలును కలిగి ఉన్నారు.
Sellers S. Crain, Jr.

ఇర్లీ D. ఎడ్వర్డ్స్

డా. ఇర్ల్ D. ఎడ్వర్డ్స్ బోధన, మిషన్లు మరియు స్కాలర్‌షిప్ కోసం తన జీవితాన్ని భగవంతునికి అర్పించారు. ఆయన సెంట్రల్ క్రిస్టియన్ కాలేజ్ (ఇప్పుడు ఓక్లాహోమా క్రిస్టియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్) హాజరయ్యారు మరియు ఈయన డేవిండ్ లిప్‌స్కాంబ్ కాలేజీలో కమ్యూనికేషన్స్‌లో బి.ఏ డిగ్రి సాధించారు. ఈయన హార్డింగ్ గ్రాడ్యుయేట్ స్కూల్ నుండి M.Th. డిగ్రీ పొందారు మరియు ఈయన డీర్ఫీల్డ్, ఇలినోయిస్‌లోని ట్రినిటీ ఇవాంజెలికల్ డివైనిటీ స్కూల్‌లో తన D.Miss. పూర్తి చేశారు. ఎడ్వర్డ్స్ 1952 బోధనను ప్రారంభించారు మరియు కాన్సాస్, అర్కాన్సాస్, సిలిసే మరియు ఫ్లోరెన్స్, ఇటలీల్లో మినిస్టర్ వలె సేవ చేశారు (1960-1976). ఈయన గాస్పెల్ అడ్వికేట్స్పిర్చువల్ స్వర్డ్ మరియు ఇతర పిరియాడికల్‌లు కోసం రచించారు మరియు ఈయన ప్రొటెక్టింగ్ అవర్ “బ్లైండ్ సైడ్” యొక్క రచయిత. ఎడ్వర్డ్స 1976 నుండి 1977 వరకు మిషన్‌ల ప్రత్యేక ప్రొఫెసర్ వలె హార్డింగ్ విశ్వవిద్యాలయంలో బోధించారు. 1982లో, ఈయన ఫ్రీడ్-హార్డెమ్యాన్ విశ్వవిద్యాలయంలో బైబిల్ బోధనను ప్రారంభించారు, ఇక్కడ ఆయన 1991 నుండి 1993 వరకు స్కూల్ ఆఫ్ బైబిలికల్ స్టడీస్ యొక్క డీన్ వలె మరియు 1989 నుండి 2008 వరకు బైబిల్‌లో గ్రాడ్యుయేట్ విద్యలకు డైరెక్టర్‌గా సేవలు అందించారు. ఈయన తన అద్భుతమైన బోధనకు పలుసార్లు ఫ్రీడ్-హార్డెమ్యాన్ ద్వారా సత్కరించబడ్డారు. ఓక్లాహోమా క్రిస్టియన్ 1998లోని కాలేజ్ ఆప్ బైబిలికల్ స్టడీస్ కోసం సంవత్సర పోషిత పుత్రుడుగా పేరు పొందారు. 2004లో, వార్షిక FHU బోధకుల ప్రశంస డిన్నర్‌లో సత్కరించబడ్డారు. ఎడ్వర్డ్ 1953లో గ్వెండాలేన్ హాల్‌ను వివాహం చేసుకున్నారు మరియు ఆమె 1953లో మరణించింది. వారికి ఇద్దరు పిల్లలు టెర్రీ మరియు కారెన్ మరియు ఎనిమిది మనమలను ఉన్నారు. ఎడ్వర్డ్ 1988లో మాజీ లోరా యంగ్‌కు పునఃవివాహం చేసుకున్నారు.
Earl D. Edwards

విల్లియం W. గ్రాషమ్

డా. విల్లియం W. గ్రాషమ్ టెక్సాస్, కాలిఫోర్నియా, అరిజోనా, జర్మనీ మరియు స్కాట్లాండ్‌ల్లో గత అరవై సంవత్సరాలుగా బోధిస్తున్నారు. ఈయన పెప్పర్డైన్ విశ్వవిద్యాలయం నుండి 1962లో B.A. మరియు 1968లో M.A. పూర్తి చేశారు మరియు 1975లో అబిలెనే క్రిస్టియన్ విశ్వవిద్యాలయం నుండి M.Div. పూర్తి చేశారు. డెడ్ సీ స్క్రోల్స్ రచయితలు అయిన క్యుమ్రాన్ సంఘం యొక్క స్వభావాన్ని పరిశీలించిన సిద్ధాంత వ్యాసం పూర్తి చేసినందుకు స్కాట్లాండ్‌లోని అబెర్డీన్ విశ్వవిద్యాలయం 1985లో ఈయనకు Ph.D. అందించింది. 1975 నుండి 1978 వరకు, గ్రాషమ్ మరియు అతని కుటుంబం జర్మనీలోని కైసెర్స్‌లౌటెర్న్‌లో నివసించారు, ఇక్కడ ఆయన అమెరికా మిలిటరీ సమూహానికి బోధనలు చేశారు. తర్వాత ఆయన తన చదువు కొనసాగించడానికి స్కాట్లాండ్‌లోని అబెర్డీన్‌కు మారారు. అక్కడ, వారు లార్డ్స్ చర్చి యొక్క స్థానిక సమూహాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడ్డారు. గ్రాషమ్ హీబ్రూ యూనివర్శిటీ ఆఫ్ జెరూసలేంలో పోస్ట్-డాక్టరల్ అధ్యయనాలను పూర్తి చేశారు మరియు ఇజ్రాయిల్‌లోని టెల్ డోర్‌లో జరిగిన పురావస్తు తవ్వకాల్లో కూడా పాల్గొన్నారు. పదిహేను సంవత్సరాలపాటు, ఆయన డల్లాస్, టెక్సాస్‌లో సెంటర్ ఫర్ క్రిస్టయన్ ఎడ్యుకేషన్‌లో పాత మరియు కొత్త బైబిల్లో భాగాలు మరియు బైబిలికల్ థియాలజీ కోర్సులను బోధించారు. ఆయన 2005లో రిటైర్ అయ్యారు కాని బైబిల్ మరియు పురావస్తు శాస్త్రంపై మరియు పాత బైబిల్లో భాగాల్లోని గాస్పెల్‌పై గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సెమీనార్‌ల ఇవ్వడం కొనసాగించారు. అతను మరియు ఆయన భార్య ఎలీనోర్‌కు నలుగురు పిల్లలు, పదిహేడు మనమలు మరియు పన్నెండు మునిమనమలు ఉన్నారు.
William W. Grasham

డేటన్ కీసీ

డేటన్ కీసీ అబిలైన్ క్రిస్టయన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ అయ్యారు మరియు ఇండియానాలోని ఇండియానాపోలిస్‌లో బట్లర్ విశ్వవిద్యాలయంలో అతని M.A. పట్టా పొందారు, అలాగే భాష మరియు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆయన ఇండియానా, లూసియనా, టెక్సాస్ మరియు పాత ఓక్లాహోమాల్లో పూర్తి స్థాయి బోధకుడు వలె సేవలు అందించారు మరియు నైజీరియా, ఆఫ్రికాలో బైబిల్-శిక్షణా పాఠశాలలు మరియు బోధనా సెమినార్‌లను నిర్వహించారు. అతని బోధన మరియు మిషన్ కార్యాచరణ కోసం కెనడా, ఉక్రెయిన్, భారతదేశం, దక్షిణ ఆఫ్రికా, ట్రినిడాడ్ మరియు రష్యాలను సందర్శించారు. ఇరవై ఒక్క సంవత్సరాలపాటు, ఈయన టెక్సాస్‌లోని లుబాక్‌లో ఉన్న సన్‌సెట్ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ (ఇప్పుడు సన్‌సెట్ ఇంటర్నేషనల్ బైబిల్ ఇన్‌స్టిట్యూట్)లో శిక్షకుడు వలె పని చేశారు. ఈ సమయంలో, అతను దాదాపు ముప్పై ఐదు రాష్ట్రాల్లో గాస్పెల్ సమావేశాలు, నాయకత్వ కార్యగోష్టులు, క్రిస్టియన్ హోమ్ సెమినార్లు మరియు ఉపాధ్యాయ శిక్షణా కోర్సులను నిర్వహించారు. తరగతి ఉపాధ్యాయుని వలె సహోదరుడు కీసీ యొక్క పనితనం సన్‌సెట్ యొక్క ఉపగ్రహ స్కూల్ కార్యక్రమానికి విస్తరించింది, దీనిలో క్రిస్టియన్ హోమ్ మరియు బుక్ ఆఫ్ జెరెమియాపై అతని టేప్ చేసిన కోర్సులు ఉపయోగించారు. ఒక రచయితగా, ఆయన రెస్టోరేషన్ రివైవల్: ది వే (బ్యాక్) టూ గాడ్హీబ్రూస్: ఏ హెవన్లీ హోమిలేఏ రీ-ఇవాల్యువేషన్ ఆఫ్ ది ఎల్డర్షిప్టీచర్ ట్రైనింగ్ టూల్స్ఏ క్రోనోలాజికల్ సర్వే ఆఫ్ ఓల్డ్ టెస్టామెంట్ మరియు ది చర్చెస్ ఆఫ్ క్రీస్ట్ డ్యూరింగ్ ది సివిల్ వార్ ప్రచురించారు. అతను మరియు ఆయన భార్య రుత్‌కు ముగ్గురు యుక్తవయస్సు వచ్చిన పిల్లలు ఉన్నారు: హావాయికి చెందిన డిటా సిమోనా, అలాస్కాకి చెందిన టోంజా రాంబౌ మరియు టెక్సాస్‌కు చెందిన డారెన్ కీసీ.
Dayton Keesee

జే లాక్‌హార్ట్

వెస్ట్ వర్జీనియా నివాసి అయిన జే లాక్‌హార్ట్ ఫ్రీడ్-హార్డెమ్యాన్ విశ్వవిద్యాలయం మరియు లిప్‌స్కాంబ్ యూనివర్శిటీల్లో చదివారు, ఇక్కడ ఆయన బైబిల్‌లో B.A. డిగ్రీ పూర్తి చేశారు. ఈయన హార్డింగ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ రిలిజియన్ నుండి న్యూ టెస్టామెంట్‌లోని ఆసక్తితో M.A. డిగ్రీ పూర్తి చేశారు. ఈయన ట్రినిటీ థియోలాజికల్ సెమీనారీలో చర్చి నిర్వహణలో ఉన్నత అధ్యయనాలను పూర్తి చేశారు. లాక్‌హార్ట్ టెక్సాస్‌లోని టేలెర్‌లో ఇరవై మూడు సంవత్సరాలపాటు చర్చి వేదిక మినిస్టర్ వలె సేవలు అందించారు మరియు ప్రస్తుతం కెంటికీలోని బెన్‌టన్‌లో చర్చి‌కు సేవలను అందిస్తున్నారు. ఈయన టెలివిజన్ మరియు రేడియో కార్యక్రమాల్లో నిర్వహించారు మరియు పలు క్రిస్టియన్ ప్రచురణలకు రచనలు అందించారు. ఈయన 1977 నుండి ఫ్రీడ్-హార్డ్‌మ్యాన్ విశ్వవిద్యాలయంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌లో సేవలు అందించారు. లాక్‌హార్ట్ మరియు అతని భార్య అర్లేన్ ముగ్గురు పిల్లలు మరియు ఆరుగురు మనమలను కలిగి ఉన్నారు.
Jay Lockhart

జాన్మెక్కిన్నె

John (Jack) T. McKinney 1927లో టెక్సాస్ లోని స్వీనిలో జన్మించాడు. మాధ్యమిక విద్యను పూర్తి చేసిన తరువాత (1944), రెండవ ప్రపంచ యుద్ధము యొక్క చివరి దినములలో US నేవీతో పసిఫిక్ మహా సముద్రములో పని చేశాడు. ఆ బాధ్యతను ముగించిన తరువాత, జాక్ టెక్సాస్ లోని అబిలేనేలో ఉన్న అబిలేనే క్రిస్టియన్ కాలేజిలో జర్మన్ భాషలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు (1949). హైడిల్బర్గ్ విశ్వవిద్యాలయములో అతడు జర్మన్ భాషను అభ్యసించాడు మరియు ప్యారిస్ లో ఫ్రెంచ్ భాషను అధ్యయనం చేశాడు.
అమెరికాకు తిరిగివచ్చిన తరువాత, టెక్సాస్ లోని ఆస్టిన్ మరియు సాన్ ఎంజిలోని సంఘములలో పరిచర్య చేశాడు, మరియు టెక్సాస్ విశ్వవిద్యాలయములో జర్మన్ భాషను బోధించేవాడు. తరువాత అతడు అబిలేనే క్రిస్టియన్ కాలేజిలో ఫ్రెంచ్ మరియు జర్మన్ భాషలను రెంటిని బోధించేవాడు. అతడు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ మరియు కేమ్నిట్జ్ లో మరియు స్విట్జర్లాండ్ లోని జురిచ్ లో పరిచర్యను జరిగించాడు. జాక్ అబిలేనే క్రిస్టియన్ కాలేజికి తిరిగివచ్చి అక్కడ గ్రీకు భాషలో మాస్టర్ డిగ్రీని సంపాదించాడు (1966). ఆ కాలములో, టెక్సాస్ లోని ట్రెంట్ ప్రాంతములో ఉన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో అతడు బోధించేవాడు. తరువాత వారి కుటుంబము పరిచర్య నిమిత్తం జురిచ్ కు తిరిగివెళ్లింది (1966-1974). ఆ సమయము యొక్క ముగింపులో, జాక్ హైడిల్బర్గ్ లోని పెప్పర్డైన్ విశ్వవిద్యాలయములో బైబిలు బోధకునిగా కూడా సేవ చేశాడు. సుమారుగా తరువాత ఇరవై సంవత్సరముల పాటు, జాక్ అర్కాన్సాస్ లోని సియర్సిలోని హార్డింగ్ విశ్వవిద్యాలయములో బైబిలు అధ్యాపకునిగా పనిచేశాడు (1974-1992). అతడు 2014లో, 86 సంవత్సరముల వయస్సులో ప్రభువునందు నిద్రించాడు.
జాక్ మరియు అతని భార్యయైన జోయాన్నే విల్కిన్సన్ లకు, నలుగురు పిల్లలు, ఎనిమిది మంది మనవళ్లు, మనవరాండ్రు, మరియు ఆరుగురు ముది-మనవళ్లు మనవరాండ్రు ఉన్నారు.
Jack McKinney

బ్రూస్ మెక్‌లార్టీ

బ్రూస్ మెక్‌లార్టీ హార్డింగ్ విశ్వవిద్యాలయం అధ్యక్షులు. ఈయన హార్డింగ్ విశ్వవిద్యాలయం నుండి బైబిల్‌లో B.A.ను పూర్తి చేశారు మరియు హార్డింగ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ రిలిజియన్ నుండి M.Th. డిగ్రీ పొందారు. ఈయన ఓహియోలోని యాష్‌ల్యాండ్‌లో యాష్‌ల్యాండ్ థియోలాజికల్ సెమినారీ నుండి D.Min. డిగ్రీ పొందారు. 1999లో, ఈయన బైబిల్‌లో “అద్భుతమైన పోషిత పుత్రుడు”గా పేరు గాంచారు. మెక్‌లార్టీ ఈ శ్రేణికి మినిస్టరీ యొక్క ఉత్తమ అనుభవాన్ని అందించారు. ఈయన ఆర్కాన్సాస్, మిస్సిసిపీ మరియు టీన్నీసీల్లో చర్చిల్లో బోధించారు. రెండు సంవత్సరాలపాటు, ఆయన మరియు అతని కుటుంబం కెన్యాలోని మీరులో మిషనరీలు. 1991 నుండి 2005 వరకు, ఆయన అర్కాన్సాస్‌లోని సియర్సేలో కాలేజ్ చర్చ్ ఆఫ్ క్రిస్ట్ కోసం బోధనా వేదిక మినిస్టర్ వలె సేవలు అందించారు. అతను మరియు ఆయన భార్య అన్నాకు ఇద్దరు కూతురులు, చార్టీ మరియు జెస్సికా.
Bruce McLarty

ఎడ్వర్డ్ P. మేయర్స్

ఎడ్వర్ట్ P. మేయర్స్ అర్కాన్సాస్‌లోని సియర్సేలో హార్డింగ్ విశ్వవిద్యాలయంలో బైబిల్ ప్రొఫెసర్ మరియు క్రిస్టియన్ డాక్టరిన్. ఈయన టెక్సాస్, ఓక్లాహోమా, ఓహియో, వెస్ట్ వర్జినీయా, టెన్నీసీ మరియు అర్కాన్సాస్‌ల్లో సమూహాలకు మినిస్టర్ వలె సేవలు అందించారు. ఈయన లూథర్ రైస్ సెమినారీ నుండి D.Min.ను మరియు డ్రూ విశ్వవిద్యాలయం నుండి Ph.D. పొందారు. ఈయన వీటితో సహా పలు పుస్తకాలను రచించారు: ఏ స్టడీ ఆఫ్ ఏంజిల్స్, ఇవిల్ అండ్ సఫరింగ్ మరియు ఆఫ్టర్ దీజ్ థింగ్స్ ఐ సా: ఏ స్టడీ ఆఫ్ రెవలేషన్. అతను మరియు ఆయన భార్య జనైస్‌కు ముగ్గురు కూతురులు కాండీ, క్రీస్టీ మరియు కారోలేన్ ఉన్నారు.
Edward P. Myers

ఓవెన్ D. ఆల్బ్రిచ్

ఓవెన్ D. ఆల్బ్రిచ్ మిస్సౌరీలోని థాయెర్‌లో జన్మించారు మరియు హార్డింగ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగంలో B.A. పూర్తి చేశారు. ఈయన హార్డింగ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ రిలిజియన్ నుండి బైబిల్ ‌లో M.A. మరియు M.R.E. డిగ్రీలను కూడా పూర్తి చేశారు. 1980లో, హార్డింగ్ ఆయనను బైబిల్‌లో “అత్యుత్తమ పోషిత పుత్రడు”గా సత్కరించింది. ఆల్బ్రిచ్ తన జీవితాన్ని మినిస్టరీలోనే గడిపారు. ఈయన ఆర్కన్సాస్, మిసౌరీ మరియు న్యూ జెర్సీల్లోని చర్చిల కోసం స్థానిక మినిస్టర్ వలె సేవలు అందించారు. 1964లో, ఈయన యుఎస్‌లోని నార్త్ఈస్ట్/సౌత్ఈస్ట్ ప్రచారాలతో పని చేశారు. ఈ ప్రయత్నాలు వలన మూడు వందల ప్రచారాలు మరియు మూడు వేల బాప్టిజమ్‌లు సంభవించాయి. మొత్తంగా, ఈయన ఇంగ్లాండ్, ఉక్రెయిన్, రష్యా, కెనడా, మెక్సికో, హైతీ, జమైకా, వెనెజులా మరియు యుఎస్‌లోని ముప్పై రాష్ట్రాల్లో సువార్తా గంథ్ర కార్యక్రమాలను నిర్వహించారు.
Owen D. Olbricht

మార్టెల్ పేస్

మార్టెల్ పేస్ ఆర్కాన్సెస్‌లో జన్మించారు మరియు మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో పెరిగారు. ఈయన మొట్టమొదటిసారిగా 1952లో పదిహేడు సంవత్సరాల వయస్సులో బోధించారు మరియు 1956 పూర్తి స్థాయి బోధకుడుగా బోధనలను ప్రారంభించారు. యాభై కంటే ఎక్కువ సంవత్సరాలపాటు బోధన చేస్తున్న పేస్ ఆర్కాన్సాస్, మిచిగాన్, మిస్సౌరీ మరియు అలాబామాల్లోని సమూహాలను సేవలు అందించారు. ఈయన ప్రస్తుతం అలాబామాలోని మోంట్గోమెరీలోని యూనివర్శిటీ చర్చ్ ఆఫ్ క్రిస్ట్‌లో ఇన్వాల్మెంట్ మినిస్టర్ వలె సేవలు అందిస్తున్నారు మరియు ఆలాబామాలోని మెంట్గోమెరీలోని ఫౌల్క్‌నెర్ విశ్వవిద్యాలయంలో V. P. బ్లాక్ కాలేజ్ ఆప్ బైబిలికల్ స్టడీస్‌లో పార్ట్ టైమ్‌గా బోధిస్తున్నారు. పేస్ టెన్నీసీలోని హెండ్రెసన్‌లో ఫ్రీడ్-హార్డెమ్యాన్ యూనివర్శిటీ; అర్కాన్సెస్, సీయర్సెలోని హార్డింగ్ యూనివర్శిటీ;టెన్నీసీ, మెంఫిస్‌లోని హార్డింగ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ ఆఫ్ రిలిజియన్ మరియు అలాబామాలోని మెంట్గోమెరీలోని రిజియెన్స్ యూనివర్శిటీ (గతంలో సదరన్ క్రిస్టియన్ యూనివర్శిటీ)ల్లో చదివారు. ఈయన B.A., M.A., మరియు M.Div. డిగ్రీలను పూర్తి చేశారు. ఈయన ది థర్డ్ ఇంకార్నేషన్ పుస్తకాన్ని కూడా రచించారు. మార్టెల్ మరియు అతని భార్య డోరిస్‌కు ముగ్గురు పిల్లలు మరియు తొమ్మిది మంది మనమలు ఉన్నారు.
Martel Pace

డెన్నీ పెట్రిల్లో

డెన్నీ పెట్రిల్లో డెన్వర్‌లోని బీర్ వ్యాలీ బైబిల్ ఇన్‌స్టిట్యూట్ యొక్క అధ్యక్షులు. ఈయన అక్కడే చదువుకున్నారు మరియు హార్డింగ్ విశ్వవిద్యాలయంలోని యార్క్ కాలేజ్‌లో మరియు హార్డింగ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ రిలిజియన్‌ల్లో కూడా చదివి A.A., B.A., మరియు M.A. డిగ్రీలను సాధించారు. ఈయన యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా నుండి మతపరమైన విద్యలో తన Ph.D. పూర్తి చేశారు. పెట్రిల్లో బోధన మరియు శిక్షణలకు తన జీవితాన్ని ఆర్పించారు. ఈయన మిస్సిసిపీలో పూర్తి స్థాయి బోధకుని వలె పని చేశారు మరియు యునైటెడ్ సేట్స్ మరియు జర్మనీ, స్పెయిన్, పనామా, అర్జెంటీనా, ఆఫ్రికా మరియు ఉక్రెయిన్‌లతోసహా పలు విదేశాల్లో 300 కంటే ఎక్కువ గాస్పెల్ సమావేశాలు మరియు సెమనార్లను నిర్వహించారు. డా. పెట్రిల్లో మాగ్నోలియా బైబిల్ కాలేజ్, యార్క్ కాలేజ్ మరియు డెన్వర్‌లోని బీర్ వ్యాలీ బైబిల్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో బైబిల్ బోధించారు. పెట్రిల్లో యొక్క రచనల్లో ఎజెకైల్, 1, 2, టిమోథీ మరియు టిటస్ యొక్క పుస్తకాలపై వ్యాఖ్యాలతోసహా మరియు మైనర్ ప్రొఫిట్స్ స్టడీ గైడ్ ఉన్నాయి. అతను మరియు అతని భార్య కాథేకు ముగ్గురు పిల్లలు లాన్సే, బ్రెట్ మరియు లౌరాలు ఉన్నారు.
Denny Petrillo

నీలే T. ప్రేయర్

స్వర్గస్తులైన నీలే T. ప్రేయర్ న్యూ ఓర్లీన్స్ బాప్టిస్ట్ సెమినారీ నుండి Th.D. స్వీకరించారు. ఆయన నలభై సంవత్సరాలపాటు హార్డింగ్ విశ్వవిద్యాలయంలో ముఖ్యమైన బైబిల్ ప్రొఫెసర్‌గా పని చేశారు మరియు ఆ సమయంలో బైబిల్ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌గా మరియు అకాడమిక్ ఎఫైర్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. ప్రేయర్ యు కెన్ ట్రస్ట్ ఇవర్ బైబిల్ అనే పుస్తకాన్ని రచించారు. ఆయన నలభై రాష్ట్రాల్లో ఐదు వందల కంటే ఎక్కువ గాస్పెల్ సమావేశాల్లో బోధించారు. ఆయన సీయర్సేలోని కాలేజీ చర్చ్ ఆఫ్ క్రిస్ట్‌లో ఎల్డర్. ఆయన మరియు ఆయన భార్య యాభై సంవత్సరాలపాటు కలిసి జీవించారు. అలన్ (మరణించారు) మరియు లోరీలు వారి పిల్లలు.
Neale T. Pryor

డేవిడ్ R. రిచ్టిన్

డేవిడ్ R. రిచ్టిన్ నలభై ఐదు సంవత్సరాలుగా బోధిస్తున్నారు మరియు గత ముప్పై సంవత్సరాలుగా టెక్సాస్‌లోని డంకన్‌విల్లేలోని క్లార్క్ రోడ్‌లో సమూహానికి సేవలు అందిస్తున్నారు, గతంలో దీనిని సానెర్ అవెన్యూ చర్చ్ ఆఫ్ క్రిస్ట్ అనేవారు. ఈయన బైబిలికల్ అధ్యయనాలపై ప్రధాన దృష్టి సారించి అబిలేన్ క్రిస్టియన్ విశ్వవిద్యాలయంలో M.A. పట్టా అందుకున్నారు. ఈయన “హౌ టు డిటర్మైన్ ది విల్ ఆఫ్ గాడ్” మరియు “హౌ టు హేవ్ ఏ రిలేషన్‌షిప్ విత్ గాడ్” వంటి అంశాలపై దృష్టి సారించి, ఉపాధ్యాయుల స్థానం గురించి మాట్లాడారు. ఆయన మరియు ఆయన భార్య షారన్‌కు జేమ్స్ మరియు డానియల్ పేర్లతో ఇద్దరు పిల్లలు ఉన్నారు.
David R. Rechtin

కోయ్ D. రోపెర్

ఓక్లాహోమాలోని డిల్ నగరంలో జన్మించిన డా. కోయ్ D. రోపెర్ తన జీవితకాలం మొత్తం బోధకునిగా, శిక్షకునిగా మరియు రచయితగా గడిపారు. ఆబిలేన్ క్రిస్టయన్ యూనివర్శిటీ నుండి బైబిల్‌లో B.S. డీగ్రీ పట్టా (1958) సాధించిన తర్వాత, ఈయన నార్త్ఈస్టరన్ స్టేట్ యూనివర్శిటీలో ఉన్నత విద్యలో M.T. (1966) పూర్తి చేశారు. రోపెర్ తర్వాత అబిలైన్ క్రిస్టియన్ యూనివర్శిటీ నుండి బైబిల్‌లో M.S. (1977) పూర్తి చేశారు మరియు ఓల్డ్ టెస్టామెంట్ ప్రధానంగా యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ నియర్ ఈస్టరన్ స్టడీస్ నుండి తన Ph.D. పూర్తి చేశారు (1988). రోపెర్ గ్రీకు భాషను ప్రధానంగా చేసుకుని హెరిటేజ్ క్రిస్టియన్ యూనివర్శిటీ నుండి M.A. సంపాదించారు (2007). రోపెర్ టెక్సాస్‌లోని చార్లీలో చర్చిలో 1995 బోధనను ప్రారంభించారు. అప్పటి నుండి, ఆయన ఓక్లాహోమ్, టెన్నీసీ, మిచిగాన్, కెనడా మరియు ఆస్ట్రేలియాల్లో బోధించారు. ఇంకా, ఆయన వెస్టరన్ క్రిస్టియన్ కాలేజ్, మాక్యూరై స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ (నార్క్ రేడ్, ఆస్ట్రేలియా), మిచిగాన్ క్రిస్టియన్ కాలేజ్, లిప్‌స్కాంబ్ యూనివర్శిటీ మరియు హెరిటేజ్ క్రిస్టియన్ యూనివర్శిటీల్లో బోధించారు. 2000 నుండి 2005 వరకు, రోపెర్ హెరిటేజ్ క్రిస్టియన్‌లో గ్రాడ్యుయేట్ స్టడీస్ యొక్క డైరెక్టర్ వలె సేవలు అందించారు. ప్రస్తుతం, ఆయన ట్రెంట్ చర్చి ఆఫ్ క్రిస్ట్ (ట్రెంట్, టెక్సాస్)లో బోధిస్తున్నారు మరియు అర్కాన్సాస్, సీయర్సేలోని ట్రూత్ ఫర్ టుడే కోసం రచనలను వ్రాస్తారు. కోయ్ మరియు అతని భార్య షార్లోటేకు ముగ్గురు పిల్లలు మరియు పది మంది మనమలు ఉన్నారు.
Coy D. Roper

డేవిడ్ L. రోపెర్

ఓక్లాహోమాలో పుట్టి, పెరిగిన డేవిడ్ L. రోపెర్ ఆబిలేనే విశ్వవిద్యాలయంలో చదివారు మరియు బైబిల్‌లో BS మరియు MS పూర్తి చేశారు. రోపెర్ పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో తన బోధన వృత్తిని ప్రారంభించారు మరియు ఓక్లాహోమా, టెక్సాస్ మరియు అర్కాన్సెస్‌ల్లో పూర్తి స్థాయి బోధకుని వలె పని చేశారు. ఈయన ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఇటలీ, టర్కీ, జపాన్ మరియు రోమానియాలతోసహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా గాస్పెల్ పంచారు. 1968 నుండి 1977 వరకు ఆస్ట్రేలియాలోని, సిడ్నీలో మిషనరీ వలె, రోపెర్ మరియు అతని కుటుంబం స్థానిక సమూహం మరియు మాక్యూరై స్కూల్ ఆఫ్ ప్రీచింగ్‌తో కలిసి పని చేశారు. రోపెర్ పలు ట్రాక్ట్స్, పుస్తకాలు మరియు బుక్‌లెట్‌లను రచించారు. అతని రచనల్లో ది డే క్రీస్ట్ కేమ్ (ఏగైన్)ప్రాక్టికల్ క్రిస్టియానిటీ: స్టడీస్ ఇన్ ది బుక్ ఆఫ్ జేమ్స్గెట్టింగ్ సీరియస్ ఎబౌట్ లవ్ మరియు త్రూ ది బైబిల్ వంటి రచనలు ప్రజాదరణ పొందాయి. ఆయన టీవీ మరియు రేడియో కార్యక్రమాలను కూడా నిర్వహించారు. రోపెర్ అర్కాన్సెస్, సియర్సేలోని ట్రూత్ ఫర్ టుడేకు అసోసియేట్ ఎడిటర్ వలె సేవలు అందించారు మరియు వాటిలో రచనలు చేయడం కొనసాగించారు.
David L. Roper

డాన్ షాకెల్ఫోర్డ్

రిటైర్ అయిన బైబిల్ ప్రొఫిసర్ డాన్ షాకెల్ఫోర్డ్ అర్కాన్సెస్, సియార్సేలోని హార్డింగ్ విశ్వవిద్యాలయంలో ముప్పై సంవత్సరాలపాటు బోధించారు. ఆయన టెక్సాస్‌లోని లుబాక్ క్రిస్టియన్ విశ్వవిద్యాలయంలో బైబిల్ డిపార్ట్‌మెంట్ యొక్క ఛైర్మన్ వలె కూడా సేవలు అందించారు. మిస్సౌరీ, జోప్లిన్ నివాసి అయిన షాకెల్ఫోర్డ్ ఓక్లోహోమా క్రిస్టియన్ విశ్వవిద్యాలయంలో చదివిస డేవిడ్ లిప్‌స్కాంబ్ విశ్వవిద్యాలయంలో తన అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన న్యూ ఓర్లీన్స్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమీనారీలో హాజరు అయ్యి, B.D. మరియు Th.D. డిగ్రీలను సంపాదించారు. మినిస్టర్ వలె, షాకెల్ఫోర్డ్ ఓక్లాహోమా, టెన్నీసీ, టెక్సాస్ మరియు లూసియనాల్లో సమూహాలకు బోధించారు. ఈయన సిసిలేలోని పాలెర్మో మరియు ఇటలీలోని ఫ్లోరెన్స్‌ల్లో మిషనరీ వలె కూడా సేవలు అందించారు. ఈయన ఇరవై-ఐదు కంటే ఎక్కువ సంవత్సరాలపాటు క్లోవెర్డేల్ చర్చి ఆఫ్ క్రిస్ట్ యొక్క ఎల్డర్ వలె సేవలు అందించారు. హార్డింగ్ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు, షాకెల్ఫోర్డ్ బైబిల్ ప్రొఫెసర్‌ వలె మరియు అంతర్జాతీయ విద్యల డీన్ వలె పని చేశారు. ప్రస్తుతం, ఈయన ట్రూత్ ఫర్ టుడేకు ఓల్డ్ టెస్టామెంట్ సలహాదారు వలె పని చేస్తూ, హార్డింగ్ కోసం సంయుక్త ప్రొఫెసర్‌ వలె సేవలు అందిస్తున్నారు మరియు అలాబామాలోని మోంట్గోమేరీలో సదరన్ క్రిస్టియన్ యూనివర్శిటీ కోసం ఓల్డ్ టెస్టామెంట్ గ్రాడ్యుయేట్ కోర్సులను బోధిస్తున్నారు. ఆయన ఏ సర్వే ఆఫ్ చర్చి హిస్టరీని రచించారు మరియు లుబాక్ క్రిస్టయన్ మరియు హార్డింగ్ రెండింటీ కోసం ఉపాధ్యాయుని పాత్ర పుస్తకాలను సవరించారు. ఆయన కథనాలు గాస్పెల్ అడ్వికేట్, రెస్టోరేషన్ క్వార్టర్లీ, ఫర్మ్ ఫౌండేషన్, పవర్ ఫర్ టుడే మరియు ది క్రిస్టియన్ క్రోనికల్‌ల్లో ప్రచురించబడ్డాయి. డాన్ మరియు అతని భార్య జాయ్స్‌కు ఐదుగురు పిల్లలు మరియు పదిహేను మంది మనమలు ఉన్నారు.
Don Shackelford

డ్యూనే వార్డెన్

ఈ సిరీస్ కోసం అసోసియేట్ న్యూ టెస్టామెంట్ ఎడిటర్ అయిన డా. డ్యూనే వార్డెన్ అర్కాన్సస్‌లోని ఫ్రాంక్లిన్‌లో జన్మించారు, కాని మిచిగాన్, ఫ్లింట్‌లో పెరిగారు. అతను ఫ్రీడ్-హార్డెమ్యాన్ విశ్వవిద్యాలయం నుండి A.A. డిగ్రీ, హార్డింగ్ విశ్వవిద్యాలయం నుండి B.A.ను, హార్డింగ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ రిలిజియన్ నుండి M.A.R. మరియు డ్యూక్ విశ్వవిద్యాలయం నుండి Ph.D.ని పూర్తి చేశారు. ఇంకా, డా. వార్డెన్ కొలంబియా విశ్వవిద్యాలయంలో క్లాసికల్ స్టడీస్‌లో మరియు గ్రీస్, ఏథెన్స్‌లోని అమెరికన్ స్కూల్ ఆఫ్ క్లాసికల్ స్టడీస్‌ల్లో పోస్ట్-డాక్టరల్ పని పూర్తి చేశారు. డా. వార్డెన్ ఓహియో వ్యాలీ విశ్వవిద్యాలయం అలాగే హార్డింగ్ విశ్వవిద్యాలయంలో బైబిల్ బోధకుని వలె పని చేశారు. ఈయన ఓహియో వ్యాలీలోని బైబిల్ డిపార్ట్‌మెంట్ యొక్క ఛైర్మన్‌గా (1986-1993) మరియు హార్డింగ్‌లోని కాలేజ్ ఆఫ్ బైబిల్ మరియు రిలిజియన్‌లో అసోసియేట్ డీన్ వలె సేవలు (1996-2005) అందించారు. ఈయన అమ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యూ టెస్టామెంట్ యొక్క ప్రొఫెసర్ వలె బోధించడం కొనసాగించారు. బోధించడంతోపాటు, డా. వార్డెన్ తన సేవా జీవిత కాలంలో మినిస్టరీగా పని చేశారు. ఈయన పూర్తి స్థాయిలో వెస్ట్-వర్జీనియా, వర్జీనియా మరియు అర్కాన్సెస్‌ల్లో బోధించారు; మరియు ఈయన ఓహియో వ్యాలీ మరియు హార్డింగ్‌లో బోధిస్తూనే పార్ట్ టైమ్ మినిస్టర్ వలె పని చేశారు. ప్రస్తుతం, ఆయన వెల్వెట్ రిడ్జ్ చర్చి ఆఫ్ క్రిస్ట్‌లో బోధిస్తున్నారు. డా. వాడెన్ వీటితో విద్వాంసక ప్రచురణల్లో పలు వ్యాసాలు మరియు కథనాలను ప్రచురించారు: బైబిలకల్ ఇంటర్‌ప్రిటేషన్: స్టడీస్ ఇన్ హానర్ ఆఫ్ జాక్ పి. లెవీస్క్లాసికల్ ఫిలాలజీరిస్టోరేషన్ క్వార్టర్లీ మరియు జర్నల్ ఫర్ ది ఎవాంజెలికల్ థియోలాజికల్ సొసైటీ. ఈయన ట్రూత్ ఫర్ టుడేగాస్పెల్ అడ్వకేట్ఫర్మ్ ఫౌండేషన్ మరియు క్రిస్టియన్ క్రోనికల్ల్లో కూడా రచనలు చేశారు. అతను మరియు అతని భార్య జనెట్‌కు డేవిడ్ M. వార్డెన్ అనే పేరుతో ఒక కుమారుడు మరియు డేవిడ్ A. మార్టిన్ అనే పేరుతో ఒక పెంచుకుంటున్న కుమారుడు ఉన్నారు.
Duane Warden