క్రీస్తు యొక్క జీవితం, 1

ప్రతి క్రైస్తవుడు సువార్త జాబితాలను చదువుటయందు ఆనందించాలి. యేసు జీవితములోని సంఘటనలను అవి జరిగిన కాల వరుసలో ఉంచుట వలన, లిఖించబడిన యేసు జీవితములోని ప్రతి భాగమును, ఆయన మాటలను, సంభాషణలను, మరియు క్రియలను అనుదిన జీవన అనుభవములతో అనుసంధానము చేసి పరిశీలించి క్రీస్తు జీవించిన జీవితము పాఠకుడు జీవించుటకు అన్వయముతో కూడిన సవాలు చేస్తూ  డేవిడ్ L. రోపెర్ మనలను ఒక నేర్చుకునే అనుభవము గుండా తీసుకువెళ్తాడు. Roper అతని పాలస్తీన భూగోళశాస్త్రము, దాని ప్రజల ఆచార-సంప్రదాయములు, మరియు యేసు చుట్టూ ఉన్న వివిధ గుంపుల ప్రజల వదచిత్రములతో యేసు జీవితమును మన హృదయములలో మండునట్లు చేస్తున్నాడు. ఈ కోర్సు యేసు తండ్రి యొద్ద నుండి మనకు తెచ్చిన వార్తను మాత్రమేకాక, ఆయన జీవిత పరిస్థితులను సమకూర్చిన దృశ్యములు, శబ్దములు, ధూళి మరియు జీవన శైలి, పగలు రాత్రులను మనకు తెలియజేస్తుంది. ఈ కోర్సు భాగములను ఆలోచనతో చదివేవారెవరూ మునుపటి వ్యక్తులవలె ఉండరు. యేసుతో నడిచి, ఆయన బోధలు విని, ఆయన తన సమకాలికులకు స్పందించిన విధానమును చూచి, మరియు ఆయన మరణము మరియు పునరుతానమును చూచిన తరువాత కూడా మారకుండా ఎవరు ఉండలరు!


కోర్సులో ఏమి లభిస్తాయి?

ఈ 50 రోజుల కోర్సు మీకు అవసరమైన అన్ని అంశాలతో అందించబడుతుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి మీకు అదనపు సమయం అవసరమైతే, మీరు అదనపు 30 రోజులపాటు సమయాన్ని పెంచుకోవచ్చు. నమూనా కోర్సు అంశాలు చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డిజిటల్ పుస్తకం

క్రీస్తు యొక్క జీవితం, 1 పుస్తకం డేవిడ్ L. రోపెర్ వ్రాశారు, దాని డిజిటల్ కాపీ మీకు కోర్సులో మీ అధ్యాపకుని వలె ఉపయోగపడుతుంది మరియు కోర్సు ముగిసిన తర్వాత అది మీ స్వంతమవుతుంది.

ఐదు అధ్యయన మార్గదర్శకాలు

ఇవి మీరు చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన కీలక పదాలు, అంశాలు, వ్యక్తులు మరియు స్థలాలను మీకు తెలియజేయడం ద్వారా మీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయంగా ఉంటాయి.

ఆరు పరీక్షలు

మీకు ఆటంకం కాకుండా సహాయంగా రూపొందించబడిన ప్రతి పరీక్షలో నేర్పిన అంశాలను మీరు చక్కగా అర్థం చేసుకున్నారని నిర్ధారించడానికి చదవాలని పేర్కొన్న వాటి నుండి సేకరించిన యాభై ప్రశ్నలు ఉంటాయి. చివరి పరీక్షలో అన్ని అంశాల నుండి ప్రశ్నలు ఉంటాయి.

చదవాల్సిన వేగం మార్గదర్శకం

మీరు చదువుతున్న వేగం మార్గదర్శకంతో మీరు చదవాల్సిన షెడ్యూల్ కంటే ముందు ఉండండి. ఈ మార్గదర్శకం మీరు సెట్ చేసుకున్న సమయంలో కోర్సు పూర్తి చేయడానికి ఒక రోజులో చదవాల్సిన పేజీల సంఖ్యను తెలియజేస్తుంది.

అధ్యయన సహాయాలు

మీరు కోర్సులో నేర్చుకునే వాటికి అదనంగా అదనపు అధ్యయన అంశాలు లభిస్తాయి.