మార్కు 1-8
సువార్తలను మనము చదువునప్పుడు మనం సంతోషపడాలి. సువార్త కథనముల లోతైన జ్ఞానమును సంపాదించుట ద్వారా కాకుండా యేసు యొక్క మనసు లోతులోనికి వెళ్లగలిగే మార్గము మరొక్కటి లేదు. మన ప్రభువు జీవితమును గూర్చిన ఈ కథనములు క్రొత్తగా కలుగు ఆత్మీయ జ్ఞానము విషయములో క్రొత్త ఆలోచనలను మరియు ఆనందములను పొందుకొనుటకు శక్తివంతమైన మార్గములు.














 
								 
											 
											 
											