లేవీయకాండము

లేవీయకాండము పుస్తకములో, దేవుడు యాజకత్వమును స్థాపించి ప్రత్యక్ష గుడారము వద్ద అర్పించబడవలసిన వివిధ బలులను ప్రతిష్ఠించెను. క్రైస్తవులు ధర్మశాస్త్రము క్రింద లేనప్పటికీ, మనము ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ జనాంగముగా పిలవబడుచున్నాము. పాత నిబంధన యొక అర్పణ వ్యవస్థ దేవుని యొక్క ఖచ్చితమైన గొర్రెపిల్ల, ఆయన కుమారుడైన యేసు క్రీస్తును ఇచ్చుటను ముందుగా సూచించినది. మన కొరకు ఆయన అర్పణకు స్పందనగా, ఆయన క్రొత్త నిబంధనకు నమ్మకమైన విధేయతతో జీవించాలి.


కోర్సులో ఏమి లభిస్తాయి?

ఈ 50 రోజుల కోర్సు మీకు అవసరమైన అన్ని అంశాలతో అందించబడుతుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి మీకు అదనపు సమయం అవసరమైతే, మీరు అదనపు 30 రోజులపాటు సమయాన్ని పెంచుకోవచ్చు. నమూనా కోర్సు అంశాలు చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డిజిటల్ పుస్తకం

లేవీయకాండము పుస్తకం కోయ్ డి. రోపర్ (Coy D. Roper) వ్రాశారు, దాని డిజిటల్ కాపీ మీకు కోర్సులో మీ అధ్యాపకుని వలె ఉపయోగపడుతుంది మరియు కోర్సు ముగిసిన తర్వాత అది మీ స్వంతమవుతుంది.

ఐదు అధ్యయన మార్గదర్శకాలు

ఇవి మీరు చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన కీలక పదాలు, అంశాలు, వ్యక్తులు మరియు స్థలాలను మీకు తెలియజేయడం ద్వారా మీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయంగా ఉంటాయి.

ఆరు పరీక్షలు

మీకు ఆటంకం కాకుండా సహాయంగా రూపొందించబడిన ప్రతి పరీక్షలో నేర్పిన అంశాలను మీరు చక్కగా అర్థం చేసుకున్నారని నిర్ధారించడానికి చదవాలని పేర్కొన్న వాటి నుండి సేకరించిన యాభై ప్రశ్నలు ఉంటాయి. చివరి పరీక్షలో అన్ని అంశాల నుండి ప్రశ్నలు ఉంటాయి.

చదవాల్సిన వేగం మార్గదర్శకం

మీరు చదువుతున్న వేగం మార్గదర్శకంతో మీరు చదవాల్సిన షెడ్యూల్ కంటే ముందు ఉండండి. ఈ మార్గదర్శకం మీరు సెట్ చేసుకున్న సమయంలో కోర్సు పూర్తి చేయడానికి ఒక రోజులో చదవాల్సిన పేజీల సంఖ్యను తెలియజేస్తుంది.