ఆదికాండము 1—22

దేవుని ప్రారంభాల గ్రంథం యొక్క సవిస్తర దృష్టియైన దీనిలో, విల్లియం W. గ్రాషమ్ సృష్టి వృత్తాంతం గురించి దేవుడెన్నుకున్న ప్రజగా అబ్రాహాము మరియు అతని సంతానం ఎంపిక కావడం గురించి పాపానికున్న శాశ్వత (నిత్యమైన) పర్యవసానంనుండి మానవజాతిని రక్షించడానికి దేవునికున్న సంకల్పంలోని తొలి ప్రవచనం గురించి పరిశీలనాత్మకంగా తెలియజేయడం జరిగింది. ఆదికాండము, కొందరి వ్యక్తిగత జీవిత వివరాల్ని తెలియజేస్తూ, మనం ఎక్కడినుండి వచ్చాము, ఇక్కడ ఎందుకున్నాము, మనమెక్కడికి వెళ్తున్నాము అనే మానవ చరిత్రలోని గొప్ప వేదాంతపరమైన ప్రశ్నలకు జవాబులిస్తుంది.
ప్రాచీన ప్రపంచంలో నివసించినవారి చరిత్ర విషయానికొస్తే ముఖ్యమైన అంశం దేవునితో వారికున్న సంబంధం. ఆయన తన ప్రజలతో వ్యవహరించిన విధానం, ఆయన దివ్యలక్షణాల్ని, అంటే ఆయన నీతి మరియు ఉగ్రత, చేసిన ఏర్పాటు మరియు శిక్ష, ప్రతి వాగ్దానం పట్ల విశ్వాస్యతను వెల్లడిచేస్తోంది. నేడు ప్రతి మనిషి జీవితంలోను ప్రధాన పాత్రను పోషించడానికి అర్హత ఉన్న ఏకైక నిజ దేవుడు ఆయనే. సహోదరుడు గ్రాషమ్‌తోపాటు ఈ వివరణలో దేవునిని జాగ్రత్తగా ధ్యానించుటవలన దేవునిని ఎక్కువగా తెలుసుకోగలరు. పలు విస్త్రృత వివరణలు ఉపన్యాసాలున్న అనువర్తనలు, బోధకులు ఉపదేశకులు తమ పాఠాల్ని ఇంకా మెరుగుపర్చుకోడానికి ఉపయుక్తంగా ఉంటాయి.


కోర్సులో ఏమి లభిస్తాయి?

ఈ 50 రోజుల కోర్సు మీకు అవసరమైన అన్ని అంశాలతో అందించబడుతుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి మీకు అదనపు సమయం అవసరమైతే, మీరు అదనపు 30 రోజులపాటు సమయాన్ని పెంచుకోవచ్చు. నమూనా కోర్సు అంశాలు చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డిజిటల్ పుస్తకం

ఆదికాండము 1—22 పుస్తకం విల్లియం W. గ్రాషమ్ వ్రాశారు, దాని డిజిటల్ కాపీ మీకు కోర్సులో మీ అధ్యాపకుని వలె ఉపయోగపడుతుంది మరియు కోర్సు ముగిసిన తర్వాత అది మీ స్వంతమవుతుంది.

ఐదు అధ్యయన మార్గదర్శకాలు

ఇవి మీరు చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన కీలక పదాలు, అంశాలు, వ్యక్తులు మరియు స్థలాలను మీకు తెలియజేయడం ద్వారా మీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయంగా ఉంటాయి.

ఆరు పరీక్షలు

మీకు ఆటంకం కాకుండా సహాయంగా రూపొందించబడిన ప్రతి పరీక్షలో నేర్పిన అంశాలను మీరు చక్కగా అర్థం చేసుకున్నారని నిర్ధారించడానికి చదవాలని పేర్కొన్న వాటి నుండి సేకరించిన యాభై ప్రశ్నలు ఉంటాయి. చివరి పరీక్షలో అన్ని అంశాల నుండి ప్రశ్నలు ఉంటాయి.

చదవాల్సిన వేగం మార్గదర్శకం

మీరు చదువుతున్న వేగం మార్గదర్శకంతో మీరు చదవాల్సిన షెడ్యూల్ కంటే ముందు ఉండండి. ఈ మార్గదర్శకం మీరు సెట్ చేసుకున్న సమయంలో కోర్సు పూర్తి చేయడానికి ఒక రోజులో చదవాల్సిన పేజీల సంఖ్యను తెలియజేస్తుంది.