యోబు

పాతనిబంధనలోని జ్ఞానయుక్త సాహిత్యములో ఉంచబడి, మానవ బాధ అనే అంశమును యోబు గ్రంథము విశ్లేషిస్తుంది. నేటి కాలములో అనేకుల వలే, యోబు గొప్ప వేదన, కలవరము మరియు నిరాశలతో బాధింపబడ్డాడు. అయినప్పటికీ, తన విశ్వాసమును తనను బాధించువారు నశింపజేయునట్లు ఆయన వారిని అనుమతించలేదు. నిరాశ మధ్య కూడా తనను రక్షింపగల ఏకైక రక్షకుడైన దేవునికి మొరపెట్టాడు. జీవితములో వచ్చే అనేక సుడిగాలులను దాటుటకు దేవునిపై విశ్వాసులు ఆధారపడునట్లు ఈ అధ్యయనము వారికి ఒక సవాలు విసురుతుంది. డాన్ షాకేల్ఫీల్డ్ (Don Shackelford)


కోర్సులో ఏమి లభిస్తాయి?

ఈ 50 రోజుల కోర్సు మీకు అవసరమైన అన్ని అంశాలతో అందించబడుతుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి మీకు అదనపు సమయం అవసరమైతే, మీరు అదనపు 30 రోజులపాటు సమయాన్ని పెంచుకోవచ్చు. నమూనా కోర్సు అంశాలు చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డిజిటల్ పుస్తకం

యోబు పుస్తకం డాన్ షాకేల్ఫీల్డ్ (Don Shackelford) వ్రాశారు, దాని డిజిటల్ కాపీ మీకు కోర్సులో మీ అధ్యాపకుని వలె ఉపయోగపడుతుంది మరియు కోర్సు ముగిసిన తర్వాత అది మీ స్వంతమవుతుంది.

ఐదు అధ్యయన మార్గదర్శకాలు

ఇవి మీరు చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన కీలక పదాలు, అంశాలు, వ్యక్తులు మరియు స్థలాలను మీకు తెలియజేయడం ద్వారా మీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయంగా ఉంటాయి.

ఆరు పరీక్షలు

మీకు ఆటంకం కాకుండా సహాయంగా రూపొందించబడిన ప్రతి పరీక్షలో నేర్పిన అంశాలను మీరు చక్కగా అర్థం చేసుకున్నారని నిర్ధారించడానికి చదవాలని పేర్కొన్న వాటి నుండి సేకరించిన యాభై ప్రశ్నలు ఉంటాయి. చివరి పరీక్షలో అన్ని అంశాల నుండి ప్రశ్నలు ఉంటాయి.

చదవాల్సిన వేగం మార్గదర్శకం

మీరు చదువుతున్న వేగం మార్గదర్శకంతో మీరు చదవాల్సిన షెడ్యూల్ కంటే ముందు ఉండండి. ఈ మార్గదర్శకం మీరు సెట్ చేసుకున్న సమయంలో కోర్సు పూర్తి చేయడానికి ఒక రోజులో చదవాల్సిన పేజీల సంఖ్యను తెలియజేస్తుంది.

అధ్యయన సహాయాలు

మీరు కోర్సులో నేర్చుకునే వాటికి అదనంగా అదనపు అధ్యయన అంశాలు లభిస్తాయి.